హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిస్తున్న అలియా!

తాజాగా అలియా భట్ నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ మూవీ తో అలియా హాలీవుడ్‌ లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అలియా.. నటి గాల్ గాడోట్‌ కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిస్తున్న అలియా!
New Update

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలియని వారుండరు. తెలుగులో ఆమె ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలో నటించింది. ఆ సమయంలో ఆమె తెలుగు నేర్చుకోవడానికి చాలా ఇంట్రస్ట్‌ చూపించింది. ఆ తరువాత ఆమె భర్త రణబీర్‌ కపూర్, తను జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఆమె తెలుగులో ఓ పాట పాడి అలరించింది.

అలియా రీసెంట్‌ మూవీ రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ చిత్రం విడుదలై ఓ మోస్తరు హిట్‌ అందుకుంది. తాజాగా అలియా భట్ నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఈ మూవీ తో అలియా హాలీవుడ్‌ లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అలియా.. నటి గాల్ గాడోట్‌ కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

అలియా చాలా హిందీ సినిమాలు చేసినప్పటికీ ఆమెకు తెలుగు భాష అంటే అభిమానం ఎక్కువ. అందుకే సినిమా ప్రమోషన్స్ టైమ్ లో కూడా ఆమె తెలుగులో మాట్లాడానికి ప్రయత్నించేది. తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకునే ప్రయత్నం చేసింది. ఆమెకు తెలుగు భాషపై ప్రత్యేక అభిమానం ఉంది.

గాల్ గాడోట్, అలియా ఒక ఇంటర్వ్యూలో కలిసి మాట్లాడారు. ఆమె గాల్‌కి అందరికీ నమస్కారం అంటూ తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది. మీ అందరికీ నా ముద్దులు అని చెప్పింది. గాల్ కష్టపడి ఈ లైన్లు చెప్పే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. తెలుగు ప్రజలు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా నటించాలని అందరూ అడుగుతున్నారు.

గాల్ గాడోట్ హార్ట్ ఆఫ్ స్టోన్ లో నటించింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాతో గాల్ కలర్ ఫుల్ లైఫ్ మెుదలైంది. తర్వాత చాలా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రం నెట్‌ఫ్లిక్స్ OTT ద్వారా ఆగస్టు 11న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటలీ, లండన్‌ వంటి దేశాల్లో ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. ఈ సినిమా తెలుగులోనూ నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది.

#telugu #bollywood #hollywood-actress #aliyabhat
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe