/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-19T153522.639.jpg)
Actress Abha Ratna About Casting Couch : ఏ ఇండస్ట్రీలోనైనా ఆడవాళ్లకు వేధింపులు తప్పడం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ (Cine Industry) లో అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ (Casting Couch) గురించి చెప్పడానికి భయపడేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. గతంలో తమకు ఎదురైన వేధింపుల గురించి చాలామంది ఇంటర్వ్యూల్లో బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ (Bollywood Heroine) కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/article-l-2024513120003172031000.webp)
ఫోన్ చేసి మరీ ఆ పనికి రమ్మంటారు
బాలీవడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన హీరామండీ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన హీరోయిన్ అభా రత్నా (Abha Ratna) ఇండస్ట్రీ లో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడింది." నా కెరీర్ స్టార్టింగ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడేవారు. కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని అనేవారు కానీ అది ఆడిషన్ కాదని ముందే చెప్పేవాళ్లు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/article-l-2024513720013772097000.webp)
Also Read : భార్యకో న్యాయం.. అక్కకో న్యాయమా? ‘యానిమల్’ డైరెక్టర్ పై అనసూయ ఫైర్?
అప్పట్లో ఆ ఫోన్ కాల్స్ గురించి పెద్దగా అర్థం అయ్యేది కాదు. ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మంటారు. కానీ ఆడిషన్ కాదని అంటారేంటని కన్ఫ్యూజన్ లో పడిపోయేదాన్ని. ఎందుకో ఆ మీటింగ్ కి వెళ్లాలనిపించేది కాదు. దానికి ధైర్యం కూడా రాలేదు. నన్ను డైరెక్ట్ గా మాత్రం ఎవరూ సంప్రదించలేదు" అంటూ తెలిపింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Abha-Ranta-1264x720-1-1024x583.webp)
Follow Us