/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-19.jpg)
Producer Dil Raju : టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పర్సనల్ వాట్సాప్ చాట్ లీక్ అయింది. హీరో సుహాస్ దీన్ని లీక్ చేశాడు. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వాట్సాప్ చాట్ దేనికి సంబంధించింది? అందులో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. సుహాస్ హీరోగా దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన తాజా చిత్రం 'జనక అయితే గనక'.
సందీప్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 7 న రిలీజ్ కాబోతుంది. అయితే రిలీజ్ కు ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ ను మూవీ టీమ్ ప్లాన్ చేసింది. దీని గురించి నిర్మాత దిల్ రాజుతో వాట్సాప్ లో డిస్కస్ చేసిన వాట్సాప్ చాట్ ను సుహాస్ బయట పెట్టాడు.
That's how @ThisIsDSP Garu helped us 🤗❤️#JanakaAitheGanaka premieres on September 6th 🤗#JAGOnSeptember7th pic.twitter.com/i1Kog2gh2y
— Suhas 📸 (@ActorSuhas) September 3, 2024
Also Read : ‘జైలర్ 2’ లోడింగ్.. అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
వాట్సాప్ చాట్ ఇదే..
సుహాస్: సర్ మనం ప్రీమియర్ షో వేస్తే బాగుంటుంది. ఈ మధ్య ప్రీమియర్స్ వేసిన సినిమాలన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి.
దిల్ రాజు: చూడాలి సుహాస్. ఇప్పటికిప్పుడు అంటే ప్లాన్ చేయాలి. చెక్ చేసి చెబుతా.
సుహాస్: ఈ నెల 6న సాయంత్రం ఏఎంబీ, నెక్సెస్ ఇలా అన్ని ఓపెన్ చేద్దాం సర్.
దిల్ రాజు: కొంచెం టైమ్ ఇవ్వు సుహాస్.. చెప్తా.
సుహాస్: వాయిస్ రికార్డు
దిల్ రాజు: 6న కన్ఫామ్ సుహాస్. ప్రీమియర్స్ వేసేద్దాం
సుహాస్: క్లాప్ కొడుతున్న ఎమోజీ