Om Bheem Bush: 'ఓం భీమ్ బుష్'.. అంతా నవ్వులే.. ఆసక్తికరంగా టీజర్

హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'ఓం భీమ్ బుష్'. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఆసక్తికరంగా సాగింది ఈ టీజర్. మీరు కూడా ఓ లుక్కేయండి.

Om Bheem Bush: 'ఓం భీమ్ బుష్'..  అంతా నవ్వులే.. ఆసక్తికరంగా టీజర్
New Update

Om Bheem Bush: శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఈ ముగ్గురి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'బ్రోచేవారెవరురా' సినిమాతో నవ్వులు పూయించిన ఈ ట్రియో.. 'ఓం భీమ్ బుష్' తో మరో సారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమయ్యారు.

హీరో శ్రీ విష్ణు, రాహుల్ రమేష్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'ఓం భీమ్ బుష్'. హుషారు, రౌడీ బాయ్స్ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కించారు. 'ఓం భీమ్ బుష్' అనే హాస్యభరితమైన టైటిల్ తో సినిమా పై ఆసక్తిని పెంచారు మేకర్స్. ఇక తాజాగా రిలీజైన ఈ మూవీ టీజర్ అంచనాలను మరింత పెంచేసింది. ఫుల్ కామెడీతో సూపర్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

'ఓం భీమ్ బుష్' టీజర్

ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న పేషేంట్ ను ముందు పెట్టుకొని.. సైంటిస్టులైన శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తాపీగా యూ ట్యూబ్ లో యాడ్ చూస్తున్న విజువల్స్ తో ఈ టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత చాలా పరిజ్ఞానం ఉన్న శాస్త్రవేత్తలమని చెప్పుకుంటూ.. ఈ ముగ్గురు "భైరవకోన" అనే గ్రామానికి వెళ్తారు. అక్కడి గ్రామస్థుల జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చినట్లుగా చిత్రీకరించుకుంటారు. శాస్త్రవేత్తలైన వీరు గ్రామంలో దయ్యాలు వదిలించడం వంటి సన్నివేశాలు నవ్వులు పూయించాయి.

టీజర్ ఫన్నీగా సాగుతున్న సమయంలో.. ఈ ముగ్గురు అక్కడికి వెళ్ళింది నిధి వెతకడానికి అన్నట్లుగా చూపించారు. ఇక ఆ నిధి వెతికే ప్రయత్నంలో ఈ ముగ్గురి మధ్య జరిగే కామెడీ సీన్స్, పంచ్ డైలాగ్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఫన్ తో పాటు కాస్త హర్రర్ ఎలిమెంట్స్ కూడా జోడించి టీజర్ ను ఆసక్తికరంగా చూపించారు.

publive-image

ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చరవి కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. సూపర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Director Yashasvi : ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్‍ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్

#om-bheem-bush-teaser #teaser #om-bheem-bush-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe