Actor Sathyaraj's Mother Passes Away: బాహుబలి కట్టప్ప మాతృమూర్తి కన్నుమూత!

Actor Sathyaraj's Mother Passes Away: బాహుబలి కట్టప్ప ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన తల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.

New Update
Actor Sathyaraj's Mother Passes Away: బాహుబలి కట్టప్ప మాతృమూర్తి కన్నుమూత!

Actor Sathyaraj's Mother Passes Away: బాహుబలి కట్టప్ప ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్న ఆయన తల్లి శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయసు మీద పడిన కారణంగానే ఆమె మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే సత్యరాజ్‌ తమిళనాడుకు బయల్దేరారు.

నాదాంబాళ్‌ కాళింగరాయర్‌ (94) గత కొన్ని సంవత్సరాలుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది. ఆమెకు మొత్తం ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. అబ్బాయి సత్యరాజ్, కుమర్తెలు కల్పన, రూప. ఆమెకు సత్యరాజ్ నటించిన సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు.

సత్యరాజ్ తల్లి మరణ వార్త తెలిసి తమిళనాడు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు. డీఎమ్‌కే ప్రభుత్వంలోని మంత్రులు కూడా ట్వీట్లు పెడుతున్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సత్యరాజ్ కుటుంబానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు.

సత్య రాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన బాహుబలి సినిమాలో (Baahubali) పోషించిన కట్టప్ప పాత్ర ద్వారా అందరికీ బాగా పరిచయమయ్యారు. టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలకు తండ్రి పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. ఆయన కొడుకు శిబి సత్యరాజ్ కూడా కోలీవుడ్ హీరోగానే స్థిరపడ్డారు. టాలీవుడ్‌లోని ప్రముఖులు కూడా సత్యారాజ్ మాతృవియోగానికి సానుభూతి తెలియజేశారు.

Also Read: చిరు ఫ్యాన్స్‌కు 70mm రాడ్‌ దింపిన డైరెక్టర్‌.. అటు రజనీ ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్‌ హ్యాపీ!

Advertisment
తాజా కథనాలు