/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-15T155831.730-jpg.webp)
Ram Charan Game Changer Video Leaked: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ (Director Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు సార్లు బ్రేకులు పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ విషయంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. పక్కా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.
Also Read: Surekha Vani: ఆయనను మళ్ళీ చూడాలి.. భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి
లీకైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్
ఇది ఇలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి లీకైన రామ్ చరణ్ కొత్త లుక్ (Ram CharanLook) కు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో చరణ్ ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని ఈ ఫోటోను షేర్ చేయగా.. క్షణాల్లో వైరలైంది. చరణ్ కొత్త లుక్ చూసిన అభిమానులు టెర్రిఫిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా ఈ చిత్రంలోని ఓ పాట సామాజిక మాధ్యమాల్లో లీక్ అవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు మేకర్స్. 30 సెకండ్స్ నిడివి గల ఆ ఆడియో క్లిప్ తెగ వైరలైంది. మేకర్స్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు మళ్ళీ గేమ్ ఛేంజర్ సెట్స్ నుంచి మరో లీక్ బయటకు రావడం చర్చగా మారింది.
💥💥💥#RamCharan#gamechanger#RAMCHARANAtHisFortVIZAGpic.twitter.com/E0jWQjc1pk
— Ganesh Reddy (@GaneshR54279956) March 15, 2024
#GameChanger Movie Shooting at Vizag RK Beach IAS RAM NANDAN pic.twitter.com/ccErvuIPvW
— Manu AK (@manuAK27) March 15, 2024
Also Read: Mamitha Baiju: నయా క్రష్.. రాజమౌళినే పడేసిందిగా.. ఎవరీ మమిత బైజూ?