Raj Tarun : లావణ్య ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్ట్.. రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు!

హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలను కొట్టిపారేశాడు.' లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. నన్నే టార్చర్‌ పెడుతోంది. నన్ను బద్నాం చేసేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు" అని అన్నాడు.

New Update
Raj Tarun : లావణ్య ఎపిసోడ్ లో షాకింగ్ ట్విస్ట్.. రాజ్ తరుణ్ కీలక వ్యాఖ్యలు!

Actor Raj Tarun Responds On Lavanya's Allegations : యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని, అందుకు ఓ సినీ నటే కారణమని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆ సినీ నటితో పాటూ ఆమె సోదరుడిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఇక ఈ వివాదంలో సరికొత్త ట్విస్ట్ బయటికొచ్చింది.

తాజాగా దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ లావణ్య ఆరోపణలను కొట్టిపారేశాడు. ఈ మేరకు మీడియా వేదికగా లావణ్యకు సంబంధించి పలు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. ఈ మేరకు మాట్లాడుతూ.."లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. నన్నే టార్చర్‌ పెడుతోంది. నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది. నా జీమెయిల్‌ కూడా హ్యాక్‌ చేసింది. ఆమె మాటలు నమ్మొద్దు. గుళ్లో పెళ్లి చేసుకున్నామన్నది పచ్చి అబద్ధం.

Also Read : కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. ‘బింబిసార’ ప్రీక్వెల్ తో పాటూ మరో సినిమా అనౌన్స్ మెంట్!

నన్ను బద్నాం చేసేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నాం.. అదంతా గతం. లావణ్య డ్రగ్స్ తీసుకునేది. పోలీసులకు చెప్తే ఎక్కడ నా రెప్యూటేషన్‌ దెబ్బతింటుందోనని చెప్పలేదు. లావణ్యపై డ్రగ్స్‌ కేసు, బ్లాక్‌ మెయిల్‌ కేసు సహా 3 కేసులు ఉన్నాయి. మస్తాన్‌ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది. ఆమెతో నాకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. ఆమె నన్ను ఇబ్బంది పెడుతుండడంతో న్యాయ సహాయం కోసం చూస్తున్నా. ఆమె  చెప్పేవి అన్ని అబద్ధాలే. లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. లావణ్య నన్నే కాదు.. ఆమె కుటుంబసభ్యులను కూడా బాధపెడుతోంది. లావణ్య ఆరోపణలపై DCPని కలిసి మాట్లాడాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisment
తాజా కథనాలు