/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-24T180442.525-jpg.webp)
Pavan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో 'ఓజీ' ఒకటి. సాహూ ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్.. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులు వాయిదా పడింది. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు.
Also Read: Ketika Sharma: బీచ్ అందాలతో పోటీపడుతున్న హాట్ బ్యూటీ కేతిక.. వైరలవుతున్న ఫొటోలు..!
ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్
అయితే సినిమా షూట్ కాస్త వాయిదా పడినప్పటికీ..ప్రమోషన్స్ లో భాగంగా మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వదులుతూ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మరో కొత్త అప్డేట్ ఇచ్చారు. ‘ఓజీ’ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విషెష్ తెలియజేస్తూ ఇమ్రాన్ లుక్ రివీల్ చేశారు. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో 'ఒమీ' బావు అనే గ్యాంగ్ స్టార్ పాత్ర పోషించనున్న ఇమ్రాన్ లుక్ పవర్ ఫుల్ గా కనిపించింది.
'ఓజీ' మూవీలో పవన్ కళ్యాణ్ జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించగా.. ఇమ్రాన్ హష్మీ, , ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలో పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Team #OG wishes Happy Birthday to their deadliest OMI BHAU… @emraanhashmi #TheyCallHimOG pic.twitter.com/JQcVODf8FI
— Vamsi Kaka (@vamsikaka) March 24, 2024
Also Read: Actress Anjali: విడాకులు తీసుకున్న నిర్మాతతో.. హీరోయిన్ అంజలి పెళ్లి?