Karnataka: బళ్ళారి జైలుకు కన్నడ నటుడు దర్శన్ తరలింపు

హత్యారోపణలతో విచారణ ఖైదీగా బెంగళూరు పరప్పన జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ను బళ్ళారి జైలుకు తరలించారు. బెంగళూరు జైల్లో అతనికి రాచమర్యాదలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

New Update
Karnataka: బళ్ళారి జైలుకు కన్నడ నటుడు దర్శన్ తరలింపు

Kannada actor Darshan: ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌ను బెంగళూరు హైకోర్టు ఆదేశాల మేరకు బళ్ళారి జైలుకు తరలించారు. ఇతనితో పాటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇతరులను కూడా అక్కడికి తరలిస్తారని తెలుస్తోంది.

అభిమాని రామస్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు జైల్లో రాచమర్యాదులు జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా బయటకు వచ్చాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ వున్న ఫొటో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దర్శన్ ఓ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. జైలులోపల దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందని ఈ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. రౌడీషీటర్‌ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు తెలుస్తోంది. దర్శన్‌ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీషీటర్‌ విల్సన్‌గార్డన్‌ నాగ కూడా ఉన్నాడు. దీంతో దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.

దీని మీద స్పందించిన కర్ణాటక ప్రభుత్వం..జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ వున్న ఫొటో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దర్శన్ ఓ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. జైలులోపల దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందని ఈ ఫొటోలు, వీడియోలు చూస్తే తెలుస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం తాజాగా ఈ విషయం గురించి స్పందించింది.

Also Read:  Telangana: తెలంగాణలో దడ పుట్టిస్తున్న డెంగీ

Advertisment
తాజా కథనాలు