Bobby Simha : 'భారతీయుడు 2' కు నెగిటివ్ రివ్యూలు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబీ సింహా! ‘భారతీయుడు 2’ నెగెటివ్ రివ్యూలపై బాబీ సింహా తాజాగా స్పందించారు. ఈ క్రమంలోనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారిని ఉద్దేశించి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రతిఒక్కరూ తెలివైనవాళ్లమనే అనుకుంటారు. అన్నీ తమకే తెలుసని భావిస్తారు. వాళ్ళ గురించి చింతించాల్సిన అవసరం లేదని అన్నారు. By Anil Kumar 19 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Actor Bobby Simha About Bharateeyudu 2 Negative Reviews : యూనివర్సల్ హీరో కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని చాలామంది క్రిటిక్స్ సైతం అభిప్రాయపడ్డారు. అయితే తమ చిత్రానికి వస్తోన్న నెగెటివ్ రివ్యూలపై నటుడు బాబీ సింహా తాజాగా స్పందించారు. ఈ క్రమంలోనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారిని ఉద్దేశించి ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. Also Read : సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న నిజామాబాద్ కుర్రాడు.. టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! వాళ్ళ గురించి చింతించాల్సిన అవసరం లేదు... " ప్రతిఒక్కరూ తెలివైనవాళ్లమనే అనుకుంటారు. అన్నీ తమకే తెలుసని భావిస్తారు. ఒకవేళ మేము ఏదైనా బాగుందని చెబితే.. మమ్మల్ని పిచ్చివాళ్లలా చూస్తారు. మేము ఏదో కావాలని అలా చెబుతున్నామనుకుంటారు. కాబట్టి, అలాంటి తెలివైన వారి అభిప్రాయాల గురించి చింతించాల్సిన అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు. దీంతో బాబీ సింహా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా బాబీ సింహా 'భారతీయుడు 2' లో CBI ఆఫీసర్ రోల్ లో నటించాడు. సినిమాలో కమల్ హాసన్, అతని మధ్య సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. #bharateeydu-2-movie #actor-bobby-simha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి