Allu Arjun : బన్నీకి యాక్సిడెంట్.. విరిగిన పన్ను.. స్వయంగా ప్రకటించిన అల్లు శిరీష్‌!

అల్లు అర్జున్ ఓ సందర్భంలో ఫ్లోర్ మూమెంట్ చేస్తుండగా ప్రమాదం బారిన పడ్డారట.' నేల మీద పాకుతూ వేసే ఓ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ వేసి చూపిద్దామని బన్నీ నేల మీద పడి పన్ను విరగ్గొటేసుకున్నాడు' అంటూ అల్లు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

New Update
Allu Arjun : బన్నీకి యాక్సిడెంట్.. విరిగిన పన్ను.. స్వయంగా ప్రకటించిన అల్లు శిరీష్‌!

Actor Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశ వ్యాపంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. ముఖ్యంగా ఆయన డ్యాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మిగతా స్టార్స్ తో పోలిస్తే బన్నీ డ్యాన్స్ చాల డిఫెరెంట్ గా ఉంటుంది. సినిమా సినిమాకు డ్యాన్స్ లో వేరియేషన్ చూపిస్తూ ఉంటాడు. ఎంతటి కష్టతరమైన స్టెప్ అయినా దాన్ని ఈజీగా వేసే హీరోల్లో బన్నీ ఒకరు. అయితే ఓ సందర్భంలో బన్నీ ఫ్లోర్ మూమెంట్ వేస్తుండగా ప్రమాదం బారిన పడ్డారట.

ఈ విషయాన్ని ఆయన తమ్ముడు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అప్పట్లో ఆలీ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ, శిరీష్ ఇద్దరూ పాల్గొన్నారు. ఇందులో శిరీష్ మాట్లాడుతూ.." నేల మీద పాకుతూ వేసే ఓ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ వేసి చూపిద్దామని బన్నీ నేల మీద పడి పన్ను విరగ్గొటేసుకున్నాడు.

Also Read : డ్యాన్స్ తో దుమ్ములేపిన అకీరా.. వైరల్ అవుతున్న వీడియో

సగం పన్ను విరిగింది అంటూ అంటుంటగా.. బన్నీ అది నిజమే అని చెబుతూ సగం విరిగిన పన్ను, సగం డూప్లీకేట్ పన్ను అని చెప్పారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొందరేమో ఈ వీడియో షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం డ్యాన్స్ పట్ల బన్నీ డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు