అమెరికా తలసరి ఆదాయంలో (US Per Capita Income) భారత్ (India) నాలుగో వంతుకు చేరుకోవడానికి 75 ఏళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఒక నివేదిక లో ఈ విషయాన్ని పేర్కొంది. రాబోయే దశాబ్దంలో, భారతదేశంతో సహా వందకు పైగా దేశాలు అధిక ఆదాయ వ్యక్తులతో దేశాలుగా మారడానికి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొంటాయి. అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతుకు చేరుకోవడానికి భారత్‌కు 75 ఏళ్లు పట్టవచ్చని తెలిపింది.
ఇదిలా ఉంటే, చైనాకు 10 సంవత్సరాలు ,ఇండోనేషియాకు 70 సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. ప్రతి దేశం తమ ఆర్థిక వృద్ధిని మెరుగుపరచుకోవడానికి వేగంగా చర్యలు తీసుకున్నప్పటికీ, కేవలం 34 మధ్య-ఆదాయ ఆర్థిక వ్యవస్థలు మాత్రమే అధిక-ఆదాయ స్థితికి మారగలిగాయని వెల్లడించింది.
Also Read: చండీగఢ్ కోర్టులో కాల్పులు.. IRS అధికారి మృతి