Rohan Bopanna: 43 ఏళ్ల భారత టెన్సిస్ స్టార్(Tennis Star) రోహన్ బోపన్న(Rohan Bopanna) చరిత్ర తిరగరాశాడు. శనివారం నాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 (Australian Open 2024) డబుల్స్ ఫైనల్(Doubles Final)లో ఇటలీ జోడిని ఓడించి విజయం సాధించాడు. ఈ గెలుపుతో మొట్టమొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను బోపన్న తన ఖాతాలో చేర్చుకున్నాడు. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. 43 సంవత్సరాల వయసులో ఈ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్ గా బోపన్న చరిత్ర సృష్టించాడు.
దీంతో భారత టెన్నిస్ ప్రపంచంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేపథ్యంలో బోపన్న పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) నుంచి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వరకు అందరిదీ ఒకే మాట....వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే..ప్రతిభకు అడ్డం కాదు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతిభకు వయసు అడ్డంకి కాదని..
ఈ సందర్భంగా మోడీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బోపన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపితమైందంటూ పేర్కొన్నారు. మన శక్తి సామర్థ్యాలను నిర్వచించేది ఎల్లప్పుడూ కూడా మన కృషి, పట్టుదల అంటూ పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన బోపన్నకు అభినందనలు..బోపన్న తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్ లో ఎందరికో ఆదర్శంగా నిలిచాడు అంటూ మోడీ కొనియాడారు.
వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే..
రోహన్ బోపన్న విజయం చూసిన తరువాత మళ్లీ తనకు కూడా టెన్నిస్ రాకెట్ పట్టాలనిపిస్తోందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) తెలిపారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని బోపన్న మరోసారి నిరూపించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) కూడా బోపన్న కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఛాంపియన్ గా నిలవడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించావు అంటూ కొనియాడారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ లు కూడా బోపన్న విజయానికి అభినందనలు తెలిపారు.
Also read: ఈ పండుని రోజూ ఆహారంలో చేర్చుకోండి..జిమ్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు!