Fog Accident: పొగ మంచు ఎఫెక్ట్..! వరుస పెట్టి ఢీకొన్న కార్లు.. ఎక్కడంటే?

దేవనహళ్లి సమీపంలోని ఎయిర్ పోర్టు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్కజాల ఫ్లైఓవర్ పై ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

New Update
Fog Accident: పొగ మంచు ఎఫెక్ట్..! వరుస పెట్టి ఢీకొన్న కార్లు.. ఎక్కడంటే?

చలికాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపై యాక్సిడెంట్లు పెరుగుతుంటాయి. ముఖ్యంగా రాత్రి నుంచి ఉదయం ఎండ వచ్చే వరకు రోడ్డుపై విజిబిలిటీ ఎక్కువగా కనిపించదు. దీంతో వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొంటాయి. అతివేగం ఎలాగో ప్రమాదాలకు కారణమే.. దానికి తోడు పొగమంచుతో కళ్లు సరిగ్గా కనిపించక యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. తాజాగా బెంగళూరులోనూ అదే జరిగింది.


ఢీకొన్న 8 కార్లు:
దేవనహళ్లి సమీపంలోని ఎయిర్ పోర్టు రోడ్డులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్కజాల ఫ్లైఓవర్ పై ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చిక్కజాల ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. ఈ ప్రమాదానికి కారణం పొగ మంచేనని తెలుస్తోంది.


ఎనిమిది కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. డ్రైవింగ్ స్కిల్ అంటే కేవలం డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి టెస్ట్ ఇవ్వడమే కాదు అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రపంచం అంతం కాబోతోంది అన్నట్లుగా వేగంగా డ్రైవ్ చేయడం బెంగళూరులో చాలామందికి అలవాటుగా మారిందని చెబుతున్నారు. రహదారి మొత్తం మూర్ఖులతో నిండి ఉందని.. రోడ్డుపై అన్ని రకాల మూర్ఖులు విన్యాసాలు చేస్తుంటారని మండిపడుతున్నారు. 'ఇది యుఎస్ఎ , కెనడాలో సాధారణం. దీన్నే పైల్ అప్ అంటారు. పొగమంచు, పేలవమైన విజిబిలిటీ, వాహనాల వేగం గంటకు 100+ కిలోమీటర్లు, గమనించడానికి-ప్రతిస్పందించడానికి చాలా తక్కువ సమయం ఉండటం ఈ ప్రమాదానికి కారణం.' అని మరో నెటిజన్ రాసుకొచ్చారు.

Also Read: కరోనాతో కేంద్రం అలెర్ట్.. రాష్ట్రాలకు కోవిడ్ అడ్వైజరీ జారీ!

WATCH:

Advertisment
తాజా కథనాలు