Washing Machine Tips: వాషింగ్ మిషన్ వాడేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు!

వాషింగ్ మెషీన్ ఎక్కువ కాలం సరిగ్గా పనిచేయాలంటే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లాగే వాషిన్ మెషీన్ శుభ్రత కూడా ముఖ్యమన్న సంగతి చాలా మందికి తెలియదు. వాషిన్ మెషిన్ వాడేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

Washing Machine Tips: వాషింగ్ మిషన్ వాడేటప్పుడు ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు!
New Update

Washing Machine Tips:  వాషింగ్ మెషీన్‌ చాలా మందికి శ్రమను తగ్గించింది. గంటల తరబడి చేసే పనులు అరగంటలో పూర్తవుతున్నాయి. ఎక్కువ బరువు ఉన్న బట్టల నుంచి స్వెటర్ల వరకు ప్రతీదీ వాషింగ్ మెషీన్ లోనే వేస్తుంటాం. అయితే, ఎలక్ట్రానిక్ వస్తువులను వాడటమే కాదు వాటికి కూడా సమానమైన శ్రద్ధ అవసరం. చాలా ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కొన్ని చిన్న చిన్న విషయాలను మాత్రం పట్టించుకోము. వాషింగ్ మెషీన్ సంవత్సరాలుగా పాడవకుండా ఉండటంతో బట్టలను సరిగ్గా ఉతికేలా ఉండాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. చాలా మంది బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్ మూత మూసేస్తుంటారు. అయితే దాని వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో వారికి తెలియదు. ఇలా చేయడం వల్ల యంత్రంలోని డ్రమ్‌లోకి తేమతో పాటు దుర్వాసన కూడా వస్తుంది.అలాగే బట్టు కూడా దుర్వాసనను వెదజల్లుతుంటాయి.

గతంలో బట్టలు మరీ మురికిగా మరకలు పడితే చేతితో ఉతకడం కష్టంగా ఉండేది. వాషింగ్ మెషీన్ తో బట్టలు ఉతకడం చాలా సులభంగా మారింది. అర నిమిషంలో ఈ పని పూర్తవుతుంది. కానీ మీరు వాషింగ్ మెషీన్ను చాలా జాగ్రత్తగా చేసుకోకపోతే అది మీ దుస్తువులను కూడా నాశనం చేస్తుంది. వాషింగ్ మెషీన్ చాలా కాలం పాటు సరిగ్గా పనిచేయాలంటే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల వలే వాషింగ్ మెషీన్ శుభ్రత కూడా చాలా ముఖ్యం. బట్టలు ఉతికిన తర్వాత వాషింగ్ మెషీన్ ఆఫ్ చేసి పూర్తిగా మూసేయడం చేస్తుంటారు. అలా చేయడం పొరపాటు. ఎందుకంటే వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతికిన తర్వాత దాని మూత కొంత సమయం తెరచి ఉంచాలి. ఇలా చేస్తే అందులో ఉన్న గాలి బయటకు పోతుంది. అలాగే బ్యాక్టీరియా ఉంటే చెడు వాసన వస్తుంది.

మీరు మూత మూసివేసినప్పుడు సువాసన ఎలా వస్తుంది ? వాషింగ్ మెషీన్లో సువాసన పొందడానికి, మీరు బేకింగ్ సోడా నీటిని ఉపయోగించాలి.మీరు ¼ కప్పు నీటిలో ¼ కప్పు బేకింగ్ సోడా కలపాలి. మీ మెషిన్ డిటర్జెంట్ కంటైనర్‌లో ఈ ద్రావణాన్ని పోయాలి. మీరు బేకింగ్ సోడా ద్రావణం, వెనిగర్ కలిపిన తర్వాత, యంత్రాన్ని ఒక సాధారణ చక్రంలో అమలు చేయండి. దీని కోసం, స్పిన్ లేదా శుభ్రం చేయడమే కాదు, పూర్తి సైకిల్ సెట్టింగ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి:  ఇంటి నుంచి ఓటు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

#technology-news #technology #tech-tricks
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe