Suryapet: మత్స్యశాఖలో అవినీతి చేప.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన డీఎఫ్‌వో! సూర్యాపేటలో అవినీతి అఫీసర్ రూపేందర్‌సింగ్ ఠాకూర్ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. కోటయ్య అనే మత్స్యకారుడి నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూపేందర్‌సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. By srinivas 20 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి ACB: సూర్యాపేటలో ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది. మత్స్యశాఖ జిల్లా అధికారి(డీఎఫ్‌వో) రూపేందర్‌సింగ్ ఠాకూర్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సారగండ్ల కోటయ్య స్థానిక మూడు చెరువుల్లో చేపలు పట్టేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం అన్నీ సర్టిఫికెట్స్ ఉన్నప్పటికీ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో తాను ఇవ్వలేనని ఎంత ప్రాధేయపడినా అధికారి వినిపించుకోలేదు. #ACB officials# caught Thakoor Roopender Singh, District Fisheries Officer, Suryapet while accepting the #bribe amount of ₹25,000 for issuing the Fishing Rights Document for a Fisherman Co-Op. Society.#AntiCorruptionBureau #Justice #Telanagna @CVAnandIPS మత్స్యకారుల… pic.twitter.com/Yj0iKtCq45 — ACB Telangana (@TelanganaACB) July 19, 2024 ఈ క్రమంలో కోటయ్య రెండు రోజుల క్రితం అధికారులను ఆశ్రయించగా రూ.25 వేలు ఇచ్చి డీఎఫ్‌వో ఇంటికి పంపించాం. కోటయ్య నుంచి లంచం తీసుకుంటుండగా రూపేందర్‌సింగ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం రూపేందర్‌సింగ్ ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు. రూపేందర్‌సింగ్ గతంలోనూ లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు పోలీసులు గుర్తించారు. #acb #suryapet #rupender-singh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి