Big Breaking: చంద్రబాబుకు మరో షాక్.. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి.. కండిషన్స్ ఇవే!

చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను కస్టడికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబును సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరింది. కానీ ఏసీబీ కోర్టు 2 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చిది.

Big Breaking: చంద్రబాబుకు మరో షాక్.. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి.. కండిషన్స్ ఇవే!
New Update

ఏపీ స్కిల్ డవల్మెంట్ కేసులో అరెస్టు అయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయిడు (Chandrababu Naidu) కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను కస్టడికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబును సీఐడీ 5 రోజుల కస్టడీకి కోరింది. కానీ ఏసీబీ కోర్టు 2 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది. చంద్రబాబును జైలులోనే విచారించేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే విచారణ నిర్వహించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. విచరణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతించింది. అయితే.. విచారణ చేసే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణకు సంబంధించి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటకు రావొద్దని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మీడియా కు విచారణ కు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదని తెలిపింది. చంద్రబాబు ఆరోగ్య రిత్యా, వయసు రిత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను కోర్టు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుందని స్పష్టం చేసింది.

రేపు, ఎల్లుండి చంద్రబాబును విచారించేందుకు కోర్టు అనుతులు ఇచ్చింది. ఇదిలా ఉంటే..చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఈ రోజు ఉదయం ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వాస్తవానికి చంద్రబాబు రిమాండ్ గడువు ఈ రోజుతో ముగియాల్సి ఉండగా మరో 2 రోజులు పొడిగించింది న్యాయస్థానం. దీంతో ఒకే రోజు చంద్రబాబుకు 3 ఎదురు దెబ్బలు తగలడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు తరఫున లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు టీడీపీ నేతలు సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. మరో వైపు లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం టీడీపీ శ్రేణులను కలవర పెడుతోంది. అదే జరిగితే నారా బ్రాహ్మణి టీడీపీ పగ్గలు చేపట్టే అవకాశం ఉందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

#chandrababu #tdp #chandrababu-jail
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe