Spice Jet: విమానంలో పనిచేయని ఏసీ..వేడితో అల్లల్లాడిన ప్రయాణికులు

మొన్న ఇండిగో విమానం...ఇవాళ స్పైస్ జెట్. అసలు అధిక ఉష్ఱోగ్రతలు అంటే దానికి తోడు ఏసీ పనిచేయలేదు. దీంతో స్పైస్ జెట్‌లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. గంటపాటూ వేడితో నానా అవస్థలూ పడ్డారు.

New Update
Spice Jet: విమానంలో పనిచేయని ఏసీ..వేడితో అల్లల్లాడిన ప్రయాణికులు

Spice Jet Flight: ఢిల్లీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎండలు దంచేస్తున్నాయి. అక్కడి ప్రజలు వేడికి అల్లల్లాడిపోతున్నారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మండే ఎండలకు వినాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఫ్లైట్స్‌లో ఏసీలు నిచేయక మొరాయిస్తున్నాయి. రీసెంట్‌గా ఇండిగో విమానంలో ఏసీ పని చేయక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు స్పైస్ జెట్ విమానంలో అదే పరిస్థితి చోటు చేసుకుంది. విమీనంలో ఎయిర్ కండీషన్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. గాలి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఢిల్లీ నుంచి బీహార్‌లోని దర్బంగాకు వెళుతున్న స్పైస్ జెట్ SG476 ఫ్లైట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు బయల్దేరిన విమానం తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలో తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా ఏసీ పనిచేయలేదు. దీంతో గంటసేపు విమానంలోని వేడి తట్టుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊపిరాడక బ్రోచర్‌లు, మ్యగజైన్‌లు, రుమాళ్లతో విసురుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read:Movies: కల్కి కథేంటో తెలిసిపోయింది..గ్రాండ్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్

Advertisment
తాజా కథనాలు