ఏబీపీ సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు... చత్తీస్ గఢ్ లో బీజీపీకి బిగ్ షాక్..!

ఏబీపీ సీ ఓటర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. చత్తీస్ గఢ్ లో మరోసారి కాంగ్రెస్ కే ప్రజలు పట్టం కట్టనున్నారు. 48 నుంచి 54 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక ప్రతిపక్ష బీజేపీకి మరోసారి షాక్ తప్పదని సర్వే వెల్లడించింది. కానీ గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.

author-image
By G Ramu
New Update
ఏబీపీ సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు... చత్తీస్ గఢ్ లో బీజీపీకి బిగ్ షాక్..!

ఏబీపీ సీ ఓటర్(Abp voter survey) సర్వేలో షాకింగ్ విషయాలు(shocking revealings) వెల్లడయ్యాయి. చత్తీస్ గఢ్ లో మరోసారి కాంగ్రెస్(congress) కే ప్రజలు పట్టం కట్టనున్నారు. 48 నుంచి 54 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. ఇక ప్రతిపక్ష బీజేపీ(bjp)కి మరోసారి షాక్ తప్పదని సర్వే వెల్లడించింది. కానీ గతంతో పోలిస్తే సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ సారి బీజేపీకి 35 నుంచి 41 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ఇక సర్వేలో ముఖ్యమంత్రి పదవికి రమణ్ సింగ్ కన్నా భూపేశ్ బాఘేల్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు. ఈ సర్వేలో రమణ్ సింగ్ కన్నా భూపేశ్ బాఘేల్ కే 25 శాతం ఓట్లు ఎక్కువ రావడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న వారిలో భూపేశ్ భాఘేల్ కు 48 శాతం మంది, రమణ్ సింగ్ కు 23శాతం మంది ఓట్లు వేశారు. ఇక డిప్యూటీ సింగ్ టీఎస్ సింగ్ డియోకు 19 శాతం మంది మద్దతు తెలిపారు.

రాష్ట్రంలో సీఎం భాఘేల్ పాలన పట్ల సంతృప్తిగా వున్నామని అత్యధికులు తెలిపారు. భూపేశ్ బాఘేల్ పాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిగా వున్నామని 46 శాతం మంది అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక భాఘేల్ పాలనతో కొంత వరకు సంతృప్తికరంగా వున్నామని 31శాతం మంది, అసలు సంతృప్తికరంగా లేమని 19 శాతం మంది, ఖచ్చితంగా చెప్పలేమని మరో రెండు శాతం మంది అభిప్రాయపడ్డారు.

చత్తీస్ గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు వున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కాషాయ పార్డీ రెడీ అవుతోంది. ఇక కాంగ్రెస్ విజయం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. దీంతో కాంగ్రెస్ ధీమాగా వుంది.

2918 అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించారు. మొదటి విడతలో దక్షిణ చత్తీస్ గడ్ లోని 18 సీట్లకు, రెండవ విడతలో 72 సీట్లకు ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక బీజేపీ 15 స్థానాల్లో గెలుపొందింది. దీంతో సీఎం రమణ్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.

Advertisment
తాజా కథనాలు