Sanjay Singh : మాగుంట చెప్పాకనే కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఆరు నెలలు ఉన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నిన్న బెయిల్ మీద విడుదల అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగుంట శ్రీనివాస్ కేజ్రీవాల్ పేరు చెప్పాడని..అందుకే అరెస్ట్ చేశారని ఆరోపించారు.

New Update
Sanjay Singh : మాగుంట చెప్పాకనే కేజ్రీవాల్ అరెస్ట్.. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్

AAP MP Sanjay Singh : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) అరెస్ట్ వెనుక కుట్ర ఉందని అంటున్నారు ఆప్(AAP) ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh). ఆరు నెలల తర్వాత నిన్న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇన్న రాత్రి ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. వెంటనే సంజయ్ ఆప్ క్యార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళారు. అక్కడ సునీత కేజ్రీవాల్ కాళ్ళకు నమస్కారం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సంజయ్‌సింగ్.

మాగుంట శ్రీనివాసే కారణం..

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్స్ లేవని చెబుతున్నారు సంజయ్ సింగ్. మాగుంట శ్రీనివాస్ రెడ్డినే కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చారని అన్నారు. అందుకే అతనికి బెయిల్ వచ్చిందని కూడా అంటున్నారు. బీజేపీ(BJP) తో కలిస్తే ఎలాంటి కేసులు ఉండవు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్‌కు టీడీపీ టికెట్ ఇవ్వడానికి కూడా కారణంఅ దే అని ఆరోపించారు సంజయ్ సింగ్.

బీజేపీకి భయపడేది లేదు..

ఆప్... బీజేపీతో ఎప్పటికీ కలవదు. అందుకే మా పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ(PM Modi) నియంత పాలనతో దేశం చాలా బాధలు పడుతోందని సంజయ్ సింగ్ అన్నారు. మోదీ ప్రభుత్వం ఎంత వేధించినా...ఆప్ భయపడదు అని..కేజ్రీవాల్ రాజీనామా చేయరు అని అన్నారు. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు త్వరలోనే విడుదల అవుతారని చెప్పారు.

Also Read:Delhi: పాంచ్ న్యాయ్-పచ్చీస్ గ్యారెంటీస్..కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

Advertisment
తాజా కథనాలు