Aamir Khan: మురుగదాస్ పై కామెంట్ చేసిన అమిర్ ఖాన్! గజిని సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న తమిళ దర్శకుడు మురగదాస్ పై బాలీవుడు హీరో అమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతంలో వీరిద్దరి కాంబోలో తమిళ గజిని సీక్వల్ గా హిందీ గజిని నిర్మించారు. By Durga Rao 02 May 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Aamir Khan on Murugadoss: సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ ఆయన తీసిన కొన్ని సినిమాలు సంచలనం రేపాయి. రమణ (ఠాగూర్ ఒరిజినల్), గజిని (Ghajini), తుపాకి, కత్తి.. ఆయన గొప్ప పనితనానికి రుజువుగా నిలుస్తాయి. ఈ సినిమాలతో సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగాడు మురుగదాస్. గజని చిత్రాన్ని అదే పేరుతో హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మురుగదాస్. కానీ కత్తి తర్వాత ఆయన తీసిన సినిమాలు వరుసగా ఫెయిలవడంతో కెరీర్లో వెనుకబడ్డాడు. ఐతే శివకార్తికేయన్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న మురుగదాస్‌కు హిందీ నుంచి సల్మాన్ ఖాన్‌తో ఓ పెద్ద సినిమా తీసే అవకాశం దక్కింది. ఇలాంటి టైంలో మురుగదాస్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ మంచి ఎలివేషన్ ఇచ్చాడు. Also Read: కోడలిపై అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్ చేయించిన అత్త.. ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు! మురుగదాస్ లాంటి నిష్కల్మషమైన, నిజాయితీ కలిగిన దర్శకుడు మరొకరిని తాను చూడలేదని ఆమిర్ ఖాన్ ఓ టీవీ షోలో కొనియాడడం విశేషం. ఆయన ఏం మాట్లాడినా.. ఏ అభిప్రాయం వ్యక్తపరిచినా.. దానికి ఫిల్టర్ అనేది ఉండదని.. చాలా నిజాయితీగా తాను ఏం చెప్పాలనుకున్నాడో అది చెబుతాడని ఆమిర్ ఖాన్ తెలిపాడు. సినిమాకు సంబంధించి మనం ఏదైనా ఐడియా చెప్పామంటే.. నచ్చితే సూపర్ హిట్ సూపర్ హిట్ అని ఎగ్జైట్ అవుతాడని.. అదే సమయంలో ఆ ఐడియా నచ్చకుంటే.. నిర్మొహమాటంగా బాలేదని చెప్పేస్తాడని.. మొహమాటాలు ఉండవని ఆమిర్ చెప్పాడు. మనం ఈ అభిప్రాయం చెబితే అవతలి వ్యక్తి ఏమనుకుంటాడో.. చెడుగా తీసుకుంటాడేమో అనే ఆలోచన ఆయనకు ఉండదని.. ఫిల్టర్ లేకుండా తన అభిప్రాయం చెప్పడం ఆయనలోని గొప్ప గుణమని ఆమిర్ తెలిపాడు. మురుగదాస్ నుంచి తాను నేర్చుకున్న మంచి విషయం ఇదే అని ఆమిర్ తెలిపాడు. మురుగదాస్‌తో పని చేసిన చాలామంది ఇదే మాట అంటుంటారు. #aamir-khan #murugadoss మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి