ఆడుతుంది డెబ్యూ సిరీస్.. అది ఆస్ట్రేలియా(Australia)పై వారి గడ్డపైనే.. అప్పటికీ పాక్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. 220 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఉంది. ఆ వెంటనే మరో 7 పరుగులు చేసి అంటే 227 రన్స్‌కి 9వికెట్లు కోల్పోయింది. ఇంకేం ఉంది. మహా అయితే మరో 3-4 పరుగులు చేస్తారు అని అంతా భావించారు. కానీ పాక్ బౌలర్ అమీర్ జమాల్(Aamer Jamal) మాత్రం ఇంకోలా అనుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై రక్షణాత్మక ధోరణిలో బ్యాటింగ్ చేయకూడదనుకున్నాడు. అటాకింగ్ చేశాడు. మీర్ హమ్జాను ఓ ఎండ్‌లో నిలబెట్టి దంచి పడేశాడు.
రికార్డులు బ్లాస్ట్:
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాడు అమీర్ జమాల్ అందరి దృష్టిని ఆకర్షించాడు. 9వ నంబర్ బ్యాటర్‌గా అమీర్ జమాల్ రికార్డు సృష్టించాడు. జమాల్ 97 బంతుల్లో 82 పరుగులు చేశాడు. దీంతో 230లోపే చుట్టేస్తుందని అనుకున్న పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 313 పరుగులు చేసింది. తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో జమాల్ ఇరగదీశాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ నుంచి 9వ నంబర్ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. 1972 అడిలైడ్‌లో 113 బంతుల్లో 72 పరుగులు చేసిన వసీం బారీ రికార్డును జమాల్ అధిగమించాడు.
అటు ఓవరాల్‌గా పాక్ నుంచి 9వ నంబర్ పరంగా జమాల్ చేసిన స్కోరు మూడో అత్యధికంగా ఉంది. 1967లో ఓవల్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ (244 బంతుల్లో 146) సాధించిన ఆసిఫ్ ఇక్బాల్ ఈ రికార్డును కలిగి ఉన్నాడు. ఇక 43 బంతుల్లో ఏడు పరుగులతో మీర్ హమ్జా నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరు 10వ వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది ఆస్ట్రేలియాలో 10వ వికెట్‌కు పాకిస్థాన్ జోడీకి రెండో అత్యధికం కావడం విశేషం. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. చివరి టెస్టు ఆడుతున్న డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజాలను స్పిన్నర్ సాజిద్ ఖాన్ ఇబ్బంది పెట్టాడు. తొలి బంతికే వార్నర్ ఫోర్ కొట్టినప్పటికీ మరుసటి బంతికే తృటిలో తప్పించుకున్నాడు.
Also Read: కుట్రలు చేస్తారు.. కుటుంబాలను చీలుస్తారు: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు