Hyderabad : కుటుంబాన్ని వదిలేసి వెళ్లిన మహిళ...పట్టించిన ఆధార్..!!

తల్లిదండ్రులను, భర్తను వదిలేసి వెళ్లిందో మహిళ. ఊరు, పేరు, మతం మార్చుకుని మరోఒకరని వివాహం చేసుకుంది. సంతోషంగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమెను ఆధార్ సాయంతో హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad : కుటుంబాన్ని వదిలేసి వెళ్లిన మహిళ...పట్టించిన ఆధార్..!!
New Update

ఆమెది ధనవంతుల కుటుంబం. తమ కంటే ఎక్కువ డబ్బున్న వ్యక్తికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. కానీ ఆమెకు ఆ జీవితం నచ్చలేదు. భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు. వాటన్నింటిని తట్టుకోలేక ఇప్పటికే ఎన్నోసార్లు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగొచ్చింది. కానీ మూడోసారి మాత్రం ఆమె ఫోన్ ఇంట్లోనే ఉంచే వెళ్లిపోయింది. తనకు సంబంధించి ఆధారాలన్నింటిని మార్చుకుంది. తానెక్కడుందో ఎవరికీ తెలియకుండా చేసుకుంది. ఊరు, పేరు, మతం మార్చుకుంది. మరోకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితం గడుపుతోంది. మిస్సింగ్ కేసు కింది నమోదు కావడంతో ఆమెను వెతుక్కూంటూ వెళ్లిన పోలీసులకు ఆధార్ ఆమెను పట్టించింది.

అసలు విషయం గురించి తెలుసుకుందాం.
కోటీశ్వరుల కుటుంబానికి చెందిన 36ఏళ్ల వివాహిత...2018 జూన్ 29న తేదీన నగరంలోని హుమాయున్ నగరంలో మిస్సయ్యింది. ఐదేళ్ల క్రితం మిస్ అయిన ఈ మహిళ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తనకు సంబంధించిన ఆధారాలన్నింటిని ఇంట్లోనే ఉంచి వెళ్లింది. అయితే తన మొదటి భర్తతో మనస్పర్థల కారణంగానే ఆమె 2014, 15 లో కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ తిరిగి వచ్చింది. కానీ 2018లో వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి రాలేదు. తన కూతురు కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి వరకట్న వేధింపుల కింద కేసు పెట్టాడు. కేస నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా ఆమె ఇంట్లో నుంచి ఇష్టపూర్వకంగానే వెళ్లిపోయినట్లు నిర్దారించారు. ఈ క్రమంలో ఆమె తండ్రి 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మహిళ భద్రతా విభాగం, మానవ అక్రమ రవాణ విభాగం నుంచి సహాయం కోరాలని పోలీసుల అదేశించింది కోర్టు.

ఇది కూడా చదవండి: రష్యా, ఉత్తర కొరియాలకు అమెరికా వార్నింగ్..ఆయుధాల ఒప్పందం చేసుకున్నారో..!!

ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు విషయాలను గుర్తించారు. ఆ మహిళ క్యాబ్ బుక్ చేసుకునేందుకు మరో మొబైల్ ఫోన్ వాడినట్లు గుర్తించారు. క్యాబ్ కంపెనీ నుంచి ఆమె వాయిస్ రికార్డింగ్ రికవరీ చేసుకున్నారు. ఆమె పుణేకి వెళ్లనట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆ ఫోన్ను ఆమె అమ్మేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆ కేసు మరింత క్లిష్టంగా మారింది. ఇన్నాళ్లూ కేసు అలాగే ఉంది. కానీ ఆధార్ గత నెలలో అప్ డేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మళ్లీ సెర్చింగ్ ప్రారంభించారు. అప్ డేట్ చేసిన కార్డులో ఊరు, పేరు, మతం, భర్తపేరు అన్ని మార్చారు. ఆదార్ సాయంతో ఆమె బ్యాంకు వివరాలు తెలుసుకున్నారు. సోషల్ మీడియా అకౌంట్ గుర్తించారు. గోవాలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లారు.

పోలీసులు ఆమెను గోవా నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. కోర్టులో హాజరుపరిచారు. ఆమె కోర్టుకు హాజరైన సమయంలో, తనకు తానుగా ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. తాను సంతోషంగా ఉన్నానని కోర్టుకు చెప్పింది. కానీ ఆమె ఇంతకు ముందే పెళ్లి జరిగినట్లు రెండో భర్తకు తెలియదు. ఆమె గురించి ఎలాంటి వివరాలు తెలియకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: దేశంకోసం ప్రాణాలు వదిలిన ఈ డీఎస్పీ కథ వింటే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు..!

#hyderabad #viral-news #woman-changers-her-identity #woman-suspence-story #latest-shocking-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe