Kottagudem: కళ్యాణానికి ముందే కాటికి.. ట్రాక్టర్ బోల్తాపడి కాబోయే జంట మృతి!

మరికొన్ని రోజుల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోయే యువ జంటను మృత్యువు కబలించింది. రాఖీ పండుగరోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తుమ్మలచెరువు, కమలాపురం గ్రామాలకు చెందిన ప్రసాద్, నాగమణి ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయారు. ఈ ఘటన రెండు ఊర్లలో విషాదం నింపింది.

New Update
Kottagudem: కళ్యాణానికి ముందే కాటికి.. ట్రాక్టర్ బోల్తాపడి కాబోయే జంట మృతి!

Kottagudem: మరికొన్ని రోజుల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటికాబోయే జంటను కాలం కాటేసింది. ఎన్నో ఆశలతో భవిష్యత్తును కలలు కంటూ అప్యాయంగా నడుచుకుంటున్న ఇరుకుంటుంబాల మధ్య ఊహించని పెను విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండుగపూట తోబుట్టువులతో ఆనందంగా ఉందామనుకుని ఆరాటపడ్డ వారి జీవితాలను మృత్యువు కబళించింది. ఈ ఘటన స్థానికులతోపాటు జనాలను కలిచివేయగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కృష్ణయ్య, ఆదిలక్ష్మి దంపతుల రెండో కుమారుడు తాటి ప్రసాద్‌ (25) ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. అయితే ఇటీవలే ములకలపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన పత్రి నాగమణితో పెళ్లి కుదిరింది. వ్యవసాయ పనులు పూర్తి కాగానే ఎంగేజ్ మెంట్, మ్యారేజ్ డేట్ పెట్టుకుందామని ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు నడుస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం!

ఈ క్రమంలోనే నాగమణి నాగమణికి తండ్రి లేకపోవడంతో వారి వ్యవసాయ పనులు చూస్తున్నాడు ప్రసాద్. ఇందులో భాగంగానే తన ట్రాక్టర్‌ తీసుకొని నాగమణి ఇంటికి వెళ్లిన ప్రసాద్.. రాఖీ పండుగ కావడంతో రాత్రి పూట తన ఇంటికి బయలుదేరాడు. అయితే అప్పటికే కొంత దూరం వెళ్లిన ప్రసాద్ కోసం మరొకరి సాయంతో బైక్ పై వెళ్లిన నాగమణి.. పొద్దు పోయిందని, ఉదయం వెళ్లాలని కోరింది. దీంతో ప్రసాద్, నాగమణి కలిసి అదే ట్రాక్టర్ పై తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే కొత్తూరు వద్ద వారి ట్రాక్టర్‌ అనుకోకుండా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రసాద్, నాగమణి అక్కడికక్కడే దుర్మరణం చెందడంతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Advertisment
తాజా కథనాలు