లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నేడు ఏదో దశ పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే యూపీలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం ఇంతవరకు ఓటు వేయలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కౌశాంబి పరిధిలోని హిసంపూర్ మాడో అనే గ్రామంలో 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లు తమ ఊరిలో ఓటింగ్ బహిష్కరణకు సంబంధించిన పోస్టర్లు అతికించారు. పోలింగ్ కేంద్రం వద్దకు ఇప్పటివరుకు ఒక్కరూ కూడా ఓటు వేసేందుకు రాలేదు.
Also Read: ప్రభుత్వ బ్యాంకుల విలీనం ఆగిపోతుంది.. కానీ.. ఇంకోరకం షాక్ రాబోతోంది!
తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని.. రాజకీయ నాయకులు తమ గ్రామం గురించి పట్టించుకోలేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తమ గ్రామంలో ఓటింగ్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మా గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు లేదని.. రైలు పట్టాలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆ గ్రామ పెద్ద వీరేంద్ర యాదవ్ అన్నారు. ఇక్కడ రైల్వేలైన్‌పై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజాప్రతినిధులను కోరినా కూడా వాళ్లు పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం ఆ గ్రామ ప్రజలు పోలింగ్ కేంద్రం బయట నిరసన చేస్తున్నారు. అధికారులు వారికి నచ్చజెప్పినా కూడా తమ డిమాండ్లు నెరవేర్చేవరకు ఓటు వేయమని చెబుతున్నారు.
Also Read: ఛీ..నువ్వేం తల్లివి.. మహిళ ప్రాణం తీసిన ట్రోలింగ్..!!