Viral Video: 'జనగణమన'ను ఎంత క్యూట్‌గా పాడాడో చూడండి.. మన రాజకీయ నాయకులు కంటే బెటరబ్బా!

ఓ బుడ్డోడు జాతీయ గీతాన్ని పాడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వీడియోలో 'డయ్‌ డయ్‌ డయ్‌' అంటూ లాస్ట్‌లో 'డయ్‌హింద్‌' అనడం వినిపిస్తోంది. ఈ వీడియో చూడడం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Viral Video: 'జనగణమన'ను ఎంత క్యూట్‌గా పాడాడో చూడండి.. మన రాజకీయ నాయకులు కంటే బెటరబ్బా!

చిన్నప్పుడు స్కూల్‌లో జాతీయ గీతం(National Anthem) అందరితోనూ పాడిస్తుంటారు. చాలా స్కూల్స్‌లో జాతీయ పాటల్లో ఒకటైన 'వందేమాతరం'తో క్లాసులు మొదలవుతాయి.. జాతీయ గీతమైన 'జనగణమన'తో క్లాసులు ఎండ్‌ అవుతాయి. ఇలా 'జనగణమన' చిన్నప్పటి నుంచి అందరి నోళ్లలో నానుతుంటుంది. ఇక ఈ జాతీయ గీతాన్ని చిన్నపిల్లలు పాడుతున్న వీడియోలు సోషల్‌మీడియాలో నిత్యం వైరల్‌ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ఓ బుడ్డోడు జాతీయ గీతం ఆలపిస్తున్న వీడియో నెట్టింట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.

చిన్నప్పుడు చాలామందిని అన్ని పదాలు నోరు తిరగవు. అందుకే పిల్లలు ఏం మాట్లాడినా నవ్వొస్తుంది. ఈ వీడియోలోని బుడ్డోడు కూడా 'డ' అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ కనిపించాడు. 'డయ్‌ డయ్‌ డయ్‌' అంటూ లాస్ట్‌లో 'డయ్‌హింద్‌' అనడం వినిపిస్తోంది.

ఈ బుడ్డోడి జాతీయ గీతానికి వివిధ రకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు. మన రాజకీయ నాయకుల కంటే చాలా మంచిగా జాతీయ గీతాన్ని ఆలిపిస్తున్నాడని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

జనగణమన.. గూస్‌బంప్స్‌:
జనగణమన, భారత జాతీయగీతం. నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగంలోని గీతం ఇది. 1911 డిసెంబరు 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు. 1912 జనవరి లో ఈ గీతాన్ని 'తత్వ భోదిని' అనే పత్రిక 'భారత విధాత' అనే పేరుతో ప్రచురించింది. 1912 లో ఈ పాటను ఠాగూర్ మేనకోడలు సరళా దేవి చౌధురాని పాఠశాల విద్యార్థుల బృందంతో పాటు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు బిషన్ నారాయణ్ ధర్, అంబికా చరణ్ మజుందార్ లాంటి ప్రముఖ కాంగ్రెస్ సభ్యుల ముందు ప్రదర్శించారు.
1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించారు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

Also Read: అత్తను రఫాడిస్తున్న స్వప్న.. అప్పుకు యాక్సిడెంట్..షాక్ లో కావ్య..!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు