Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. స్కూల్ బస్ కిందపడిన 2ఏళ్ల పాప

హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్ లో దారుణం జరిగింది. రెండేళ్ల పాప స్కూల్ బస్ కింద పడి చనిపోయిన ఘటన స్థానికులను కలిచివేసింది. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. కదులుతున్న బస్ కింద పడి అక్కడికక్కడే మరణించింది.

New Update
Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. స్కూల్ బస్ కిందపడిన 2ఏళ్ల పాప

Hyderabad: స్కూల్ బస్ కింద పడి మరో చిన్నారి తన తండ్రి ముందే మరణించిన భయంకరమైన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. స్కూల్‌ బస్సు ప్రమాదంలో ఇటీవలే జవహార్ నగర్ లో ఓ చిన్నారి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో నాలుగేళ్ల పాప మరణించిన విషాద ఘటనలు మరవకముందే ఈ దారుణం చోటుచేసుకుంది.

హైదరాబాద్ హబ్సిగూడ (Habsiguda)లోని రవీంద్రనగర్ (Ravindranagar) లో దారుణం జరిగింది. రెండేళ్ల పాప స్కూల్ బస్ (school bus) కింద పడి చనిపోయిన ఘటన స్థానికులను కలిచివేసింది. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. తండ్రి దగ్గరకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో కదులుతున్న బస్ కింద పడింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి, స్థానికులు ఆమెను దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయలైన పాప అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : EX Model Murder: హోటల్‌ లో మాజీ మోడల్‌ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు!

ఇదిలావుంటే.. హైదరాబాద్ జవహర్ నగర్ లో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఉదయం స్కూల్ కు వెళ్తున్న అన్నకు తోడుగా బస్సు వరకు వెళ్లింది చిన్నారి భవిష్య. బస్సు ముందు నిలబడింది. అయితే చిన్నారి బస్సు ముందు ఉన్నది చూసుకోకుండానే డ్రైవర్ బస్సును నడిపాడు. దీంతో చిన్నారి భవిష్య (3) స్కూల్ బస్సు ముందు టైర్ కింద పడి మృతి చెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందని స్థానికులు, పేరెంట్స్ ఆరోపిచంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని నడికూడి మండలం రాయపర్తి గ్రామంలో ఎస్వీ స్కూల్ వ్యాన్ కింద పడి మూడు సంవత్సరాల పాప మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి ప్రమాదాలు రెగ్యూలర్ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై స్కూల్ యాజమాన్యంతోపాటు తల్లి దండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు