Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు.. నిందితులకు 14 రోజుల రిమాండ్! ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎస్పీ భుజంగరావు, డీసీపీ తిరుపతన్నను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రణీత్ తో కలిపి ముగ్గురిని నాంపల్లి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. By srinivas 24 Mar 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Praneeth Rao : తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసు కీలక మలుపులు తిరుగుతోంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) డీఎస్పీగా పనిచేసి సస్పెండైన దుగ్యాల ప్రణీత్‌రావు(Praneeth Rao) ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్టు కావడం చర్చ నీయాంశమైంది. ఎస్పీ భుజంగరావు(Bhujanga Rao), డీసీపీ తిరుపతన్న(Tirupathanna) ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రణీత్ తో కలిపి ముగ్గురిని నాంపల్లి న్యాయమూర్తి నివాసంలో ఆదివారం హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అంతేకాదు ఇదే కేసులో తాజాగా ఓ న్యూస్ చానల్ ఎండీకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం దాటిన నిందితులు.. ఈ మేరకు భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్(Hyderabad) నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిద్దరినీ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో విచారించిన అనంతరం రాత్రికి రాత్రే వారిని అరెస్టు చేశారు. ఇక నేడు వీరిని మెజిస్ట్రేజ్ ముందు హాజరుపరచగా మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఇక భుజంగరావు, తిరుపతన్న దగ్గరినుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, నాలుగు ట్యాబ్‌లు, 5 పెన్‌డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చదవండి : BRS: బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌పై కేసు నమోదు! వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య.. అలాగే 2014లో మల్కాజ్‌గిరి ఏసీపీగా పనిచేసిన రాధ కిషన్ రావు వేధింపులు తట్టుకోలేక కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో రాధ కిషన్ రావు పేరు రాసి చనిపోయారు. దీంతో రాధ కిషన్‌పై IPC సెక్షన్ 306కింద కేసు నమోదు చేశారు. అయితే తానే నిందితుడుగా ఉన్న కేసును తానే ఇన్వెస్టిగేషన్ చేసుకున్న రాధ కిషన్ రావు తనపై కేసును క్లోజ్ చేసుకున్నాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాధ కిషన్‌రావు పాత కేసులపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. #telangana #dsp-praneeth-rao #phone-tapping-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి