/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-11-3-jpg.webp)
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ఇద్దరు వ్యక్తులను బలితీసుకుంది. పనుల్లో నిమగ్నై ఉన్న దాబాలోని సర్వర్లను కంటిరెప్పపాటులో లారీ రూపంలో మృత్యువు కబళించింది. వాహనం అతివేగంగా మీదికి దుసుకురావడంతో అక్కడిక్కడే ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. కొంతమందికి తీవ్రగాయలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందోంది.
#WATCH | 3 dead and 3 injured after a dumper truck rammed into a Dhaba in Etawah, Uttar Pradesh (16/12) pic.twitter.com/kzAuQUIwwn
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 16, 2023
ఈ మేరకు ఉత్తప్రదేశ్‌లోని మానిక్‌పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం అర్ధరాత్రి ఇటావాలోని మానిక్‌పూర్ క్రాసింగ్ (Manikpur Crossing) దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారి-2పై వేగంగా వెళ్తున్నట్రక్కు డ్రైవర్ తప్పిందంతో అదుపుతప్పింది. దీంతో రోడ్డు పక్కనున్న దాబాలోకి దూసుకెళ్లింది. అక్కడ పనిచేస్తున్న వ్యక్తులతోపాటు డిన్నర్ చేయడానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. సెకన్ వేగంలో ప్రమాదాన్ని గమనించిన కొంతమంది అలర్ట్ కాగా.. మరికొందరు ప్రమాదం గమనించేలోపే మీదకు దూసుకొచ్చింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
ఇది కూడా చదవండి :ప్రైవేట్‌గా మాట్లాడాలని పిలిచి.. ప్రియురాలిపై కారు ఎక్కించి
ఇక ఆ లారీని జార్ఖండ్ రాష్ట్రానికి చెందినగా గుర్తించినట్లు తెలిపిన ఏఎస్పీ సంజయ్ వర్మా.. కాన్పూర్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తుందని చెప్పారు. డ్రైవర్ మద్యం ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని, జేసీబీ, క్రేన్ సహాయంతో ట్రక్కును అక్కడి నుంచి తొలగించి ట్రక్కు డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.