AP: కమిషనరేట్ కు కొత్త ముఖాలు.. 26 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ మొదలైంది. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా వచ్చిన వారికి కొద్దిరోజుల్లో పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

New Update
AP: కమిషనరేట్ కు కొత్త ముఖాలు.. 26 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

AP:  2024 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు శాఖల అధికారుల బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు విజయవాడ కమిషనరేట్ కు కొత్త ముఖాలు రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్‌స్పెక్టర్లను మార్పు చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ, తూర్పు, పశ్చిమ, ఏలూరు జిల్లాల నుంచి ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కొద్దిరోజుల్లో పోస్టింగ్ లు..
ఈ బదిలీల్లో విజయవాడ నగర శాంతిభద్రతల స్టేషన్లు, సీసీఎస్, ట్రాఫిక్ స్టేషన్లలో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్లను ఏలూరు రేంజ్ కి బదిలీ చేశారు. కాకినాడ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల్లో విదులు నిర్వర్తిస్తున్న వారిని కవిషనరేట్ కు బదిలీ చేశారు. కాకినాడ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఉన్న కె.కిషోర్ బాబును ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పటికే బదిలీలపై వచ్చిన ఇన్‌స్పెక్టర్లలు పోలీసు కమిషనర్ టి.కాంతిరాణాను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. రేంజ్ నుంచి బదిలీపై వచ్చిన వారికి కొద్దిరోజుల్లో పోస్టింగ్ లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తిప్పా గణేష్, బొమ్మూరు ఇన్స్పెక్టర్ ఆర్.విజయ్ కుమార్ పశ్చిమగోదావరిజిల్లా, తాడేపల్లిగూడెం నుంచి ఎస్ఎన్ఎస్వీ నాగరాజు, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి సర్కిల్ నుంచి బలమూరి వెంకటేశ్వరరావును ఎన్టీఆర్ కమిషనరేట్ కు బదిలీ చేశారు. ఏలూరు రేంజ్లో వీఆర్ లో కే.శివాజీని ఇక్కడికి రప్పించారు.

ఇది కూడా చదవండి : Crime News: 7 రోజులు.. రెండు హై ఫ్రొఫైల్ హత్యలు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

కొత్తపేట ఇన్స్పెక్టర్ బదిలీ..
అలాగే విజయవాడ కొత్తపేట ఇన్‌స్పెక్టర్ ఎ.సుబ్రహ్మణ్యం, గుణదల ఇన్స్పెక్టర్ పి.కృష్ణమోహన్, ట్రాఫిక్ లో ఉన్న పేరవలి రామచంద్రరావు, అబ్దుల్ సలాం, బి.బాలమురళీకృష్ణ, వి.జానకిరామయ్య, ఎస్ఈబీలో ఉన్న కేవీ కృష్ణకుమార్, సీసీఎస్ లో ఉన్న పి.కృష్ణ, సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ పి.సత్యానందం, సూర్యరావుపేట ఇన్‌స్పెక్టర్ బీ.హెచ్ వెంకటేశ్వర్లు, గవర్నరుపేట ఇన్‌స్పెక్టర్ ఎ.నాగమురళీ, కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ ఎం.వీ దుర్గారావు, నున్న ఇన్‌స్పెక్టర్ కాగిత శ్రీనివాసరావును ఏలూరు రేంజ్ కు బదిలీ చేశారు. విజయవాడ ట్రాఫిక్ 1 ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్, ట్రాఫిక్ 2 ఇన్‌స్పెక్టర్ కె.క్రిష్టోఫర్, ట్రాఫిక్ 3 ఇన్‌స్పెక్టర్ ఐడీ సువర్ణరావును రేంజ్ బదిలీ రేశారు. సీసీఎస్ లో ఉన్న ఎం.రామ్ కుమార్ పి.శ్రీనివాసరావు, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ జీవీ వినయ్ మోహన్, వీఆర్లో ఉన్న ఆర్. ఆంకబాబును ఏలూరు రేంజ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.

Advertisment
తాజా కథనాలు