Children Benefits: పిల్లలో ఏకాగ్రతను పెంచే చిట్కా.. ఇది తెలుసుకుంటే మీ పిల్లలకి తిరుగే ఉండదు

పోషకాహార లోపం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అయితే.. ఇలా జరగకుండా ఉండడానికి మంచి ఆహారంతో పాటు యోగాని కూడా అలవాటు చేసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

New Update
Children Benefits: పిల్లలో ఏకాగ్రతను పెంచే చిట్కా.. ఇది తెలుసుకుంటే మీ పిల్లలకి తిరుగే ఉండదు

Yoga Benefits Children: యోగ అనేది అన్ని వయసుల వారికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అందులో భాగంగానే చిన్నపిల్లల్లో ఏకాగ్రతని పెంచడానికి యోగాసనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే.. వాటిని ఒక పద్ధతి ప్రకారం చేస్తే చాలా మంచిది. ప్రస్తుత కాలంలో పిల్లలు ఎక్కువగా ఎవరితో ఆడుకోవడానికి ఇష్టపడటంలేదు. దానికి కారణం రోజంతా సెల్ ఫోన్‌లో, ట్యాబ్లెట్స్‌, కంప్యూటర్లో ఎక్కువ టైంపాస్ చేస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ల్లోనే ఎక్కువగా మునిగిపోతున్నారు. దీనివలన ఏకాగ్రత తగ్గడంతోపాటు శారీరక, మానసిక, కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటన్నిటిని దూరం పెట్టాలంటే కొన్ని యోగాసనాలు అనేవి కచ్చితంగా చేయాలంటున్నారు యోగాని నిపుణులు. ఉరుకుల పరుగుల జీవితంలో యోగా అనేది చేయడం కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. కానీ.. యోగా చేస్తే శారీరక శక్తి పెరిగి పిల్లల మనసు, కండరాలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా మానసిక, శారీరక బ్యాలెన్స్ పెరుగుదలకు యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనితోపాటు పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగి విజయాల సాధించగలరని భావన ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లల్లో ఎమోషనల్ కంట్రోల్, దృష్టిని మెరుగుపరుస్తుంది. అలాంటి ఆసనాలను ఇప్పుడు మనం కొన్ని తెలుసుకుందాం.
ప్రతిరోజు యోగా చేస్తే వచ్చే లాభాలు:
అధో ముఖ శ్వనాసనం: శరీరాన్ని బలంగా చేయడంలో అధో ముఖ శ్వనాసనం చాలా బాగ ఉపయోపడుతుంది. ఈ పోశ్చర్ ఈజీనే కానీ.. బ్యాలెన్సింగ్, ఫ్లెక్సిబిలిటీ అనేది ముఖ్యం. ఈ ఆసనం చేతుల బలాన్ని పెంచి.. చేతులు, కాలు, భుజాల కండరాలని బలంగా చేస్తుంది. నడుము నొప్పి ఉన్నవారికి ఈ ఆసనం వేస్తే నొప్పి తగ్గుతుంది.
​భస్త్రికా ప్రాణాయామం: పిల్లలకి ఈ ఆసనం చేస్తే మెదడుకి ఆక్సిజన్‌ని పెంచి చేతి, కంటి, కాళ్ళు, వీపు వంటి ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. భుజాలను రిలాక్స్ చేసి మానసిక, శారీకంగా బలంగా ఉండేలా చేస్తుంది.
తాడాసన: ఫ్లెక్సిబిలిటీని పెంచి గట్ హెల్త్‌ని మెరుగ్గా ఉంచేదుకు ఈ ఆసనం బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ పోశ్చర్ కాలి కండరాల శరీర భాగాల బలాన్ని పెంచి పిల్లల కండరాలిని పెంచి ఎత్తు పెరిగేలా ఈ ఆసనం చేస్తుంది.
భ్రమరి ప్రాణాయామం: రోజూ ఈ ప్రాణాయామం చేస్తే మనసు ప్రశాంతంగా మారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగటంతోపాటు ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అంతేకాదు ఇది లాలాజలాన్ని ఉత్పత్తి చేసి జీర్ణక్రియ, ఊపిరితిత్తుల బలాన్ని పెంచుతుంది.

ముఖ్య గమనిక: ఈ ఆసనాలన్నీ పిల్లలు, పెద్దలకి చాలా మంచిది. అయితే.. వీటిని మొదట్లో చేసేటప్పుడు మంచి యోగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది.

ఇది కూడా చదవండి: చిన్నారుల కడుపు నొప్పి పోగొట్టే చిట్కాలు..మందులు అస్సలు వాడొద్దు

Advertisment
తాజా కథనాలు