Nellore: జాతీయ రహాదారిపై వేగంగా వెళ్తున్న కారును పెద్ద పులి ఢీ కొట్టిన ఘటన ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామ సమీపంలో ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న కారుపై పులి దాడికి పాల్పడగా కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ మేరకు స్థానికుల వివరాల ప్రకారం.. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును వెంబడించిన పులి కారుపైకి దూకి దాడికి పాల్పడి క్షణాల్లో అక్కడి నుంచి అడవిలోకి పారిపోయినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Tiger Attack: కారును ఢీ కొట్టిన పెద్ద పులి.. తుక్కు తుక్కైన బాడీ!
పెద్దపులి కారును ఢీ కొట్టిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న కారును పులి వెంబడించి దాడికి పాల్పడింది. దీంతో కారు ముందుభాగం భారీగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫారెస్ట్ అధికారులు పులికోసం గాలిస్తున్నారు.
Translate this News: