కోటిఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ ఒక్కగానొక్క కూతురు…పదేళ్ల వయస్సులోనే ప్రాణాంతక వ్యాధి బారినపడుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. తమ కుమార్తె ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఆ ఫలితాలు ఫలించలేదు. అప్పటికే మ్రుత్యువు దగ్గరికి వచ్చింది. రోజలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. కొన్ని రోజులు మాత్రమే అని వైద్యులు తెలిపారు. తమ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న కూతురు తమ ముందే మరణానికి చేరవవుతోన్నా…పుట్టెడు బాధను దిగమింగుకుని గుండెను రాయి చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ కూతురు కోరికను తీర్చి ఆమె చివరి క్షణాల్లో ఆమె కళ్లల్లో ఆనందాన్ని చూశారు. స్నేహితుడితో ఆమెకు వివాహం చేసి తన చివరి కోరికను నెరవేర్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా…దీని వెనక గుండెలను మలిపెట్టే విషాదం ఉంది. ఈ విషాద ఘటన అమెరికాలో జరిగింది.
పూర్తిగా చదవండి..పదేళ్ల చిన్నారికి పెళ్లి…అసలు విషయం తెలుస్తే కన్నీళ్లు ఆగవు..!!
ఒక్కగానొక్క కూతురు...చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. అడిగిందల్లా కాదానకుండా ఇస్తూ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు. కూతురు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి. తమ ప్రాణంగా చూసుకుంటున్న కూతురు అనారోగ్యం బారినపడింది. కానీ సాధారణ జ్వరమే అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ జ్వరమే ఆమెను కబళిస్తుందని...తమ బిడ్డను తమ నుంచి దూరం చేస్తుందని తెలిపి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలు అవిసేలా రోధిస్తూ తమ బిడ్డను ఏవిధంగా అయినా కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ పరిస్థితి చేజారిపోయిందని వైద్యులు చెప్పారు. తమ బిడ్డ ఈ భూమ్మీద ఉన్నన్ని రోజులూ సంతోషంగా ఉంచాలని ఆ పేరేంట్స్ నిర్ణయించుకున్నారు. ఆమె చివరి కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యారు.
Translate this News: