Aditya L1 Mission: తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల‌ బృందం.. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు!

ఆదిత్య L1 ప్రయోగానికి ముందు తిరుమలకు వెళ్లింది ఇస్రో శాస్త్రవేత్తల‌ బృందం. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు సైంటిస్టులు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు ఇలానే వెళ్లారు. గత జులై 13న నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Aditya L1 Mission: తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తల‌ బృందం.. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య L1 నమూనాకు ప్రత్యేక పూజలు!
New Update

Aditya L1 Mission: ఇస్రో సైంటిస్టులు (ISRO Scientist) తమ ట్రెడిషన్‌ని కంటిన్యూ చేస్తున్నారు.



చంద్రయాన్‌-3 (Chandrayaan-3) ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపు(సెప్టెంబర్ 2) శ్రీహరి కోట కేంద్రంగా నింగిలోకి ఆదిత్య-L1 ప్రయోగం జరగనుండగా.. మరోసారి తిరుమలకు వెళ్లారు సైంటిస్టులు. శ్రీవారి పాదాల చెంత ఆదిత్య-L1 (Aditya L1) నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. గత జులై 13న నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు.



ప్రతీకాత్మక సూచనగా, చంద్రయాన్-3 సూక్ష్మ నమూనాలను ఉపయోగించి వెంకటేశ్వర స్వామి వద్ద ప్రత్యేక పూజను నిర్వహించారు. ఇప్పుడు ఆదిత్య-L1 ప్రయోగం ముందు కూడా ఇస్రో సైంటిస్టులు చేస్తుండడంతో రేపటి ప్రయోగం కూడా సూపర్‌ సక్సెస్‌ అవుతుందని భక్తులు అంటున్నారు.



ఆదిత్య-L1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి:

సెప్టెంబరు 2న ఇస్రో ప్రయోగించనున్న దేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1  ద్వారా సేకరించే డేటాను విశ్లేషించిన తర్వాత సూర్యుని గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి కొత్త సమాచారాన్ని పొందవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆదిత్య-ఎల్1 భూమికి దాదాపు 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న ఫస్ట్ లాగ్రాంజియన్ పాయింట్ వరకు వెళుతుందని, అందులోని చాలా డేటాను అంతరిక్షంలోని ప్లాట్‌ఫారమ్ నుంచి మొదటిసారిగా శాస్త్రీయ సమాజానికి అందజేస్తుందని సౌర భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ దీపాంకర్ బెనర్జీ తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మిషన్‌ను రూపొందించిన బృందంలో భాగమైనవారు.



ప్రయోగానికి రిహార్సల్ పూర్తి చేశాం: ఇస్రో చీఫ్

ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ, “ ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాం. రాకెట్, ఉపగ్రహం సిద్ధంగా ఉన్నాయి, ప్రయోగానికి రిహార్సల్ పూర్తి చేశాం. రేపటి లాంచ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభం" అని సోమనాథ్‌ చెప్పారు. భూమి-సూర్య వ్యవస్థలోని ఐదు లాగ్రాంజ్ పాయింట్లలో L1 ఒకటి. ఈ సమయంలో.. గురుత్వాకర్షణ శక్తులు ఒక చిన్న వస్తువు ద్వారా భావించే సెంట్రిఫ్యూగల్ శక్తిని సమతుల్యం చేస్తాయి. శక్తి సమతుల్యత కారణంగా.. వస్తువు సూర్యుడికి అట్రెక్ట్ అవ్వదు. అంతరిక్ష ప్రయోగాల్లో ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ సాగుతోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ఏ దేశానికీ సాధ్యంకాని రికార్డును సాధించింది. ఇటీవల చేపట్టిన చంద్రయాన్–3తో తన లక్ష్యం దిశగా దూసుకుపోతోంది. ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో..వరుస ప్రయోగాలతో ఫుల్‌ జోష్‌లో ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 6 ప్రయోగాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో మరింత వేగం పెంచింది. తొలిసారి సూర్యుడిపైకి రాకెట్‌ను పంపించేందుకు రెడీ అయ్యింది. ‘ఆదిత్య-ఎల్‌1’తో సూర్యుడిపై పరిశోధనలకు రంగం సిద్ధం చేసింది. రేపే ఈ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లనున్నది.



ALSO READ: చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్

#india-to-launch-solar-observatory-mission-aditya-l1 #isro-solar-mission-aditya-l1 #indias-first-solar-mission-aditya-l1 #first-space-based-solar-observatory-mission #aditya-l1-mission #aditya-l-1-mission
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe