Pesticides: పురుగుల మందులతో క్యాన్సర్‌ ముప్పు.. పరిశోధనలో వెల్లడైన సంచలన నిజాలు

కీటకాలు, కలుపుమొక్కల బెడదను తగ్గించేందుకు భారత్‌లో వినియోగించే పలు రకాల పురుగుల మందులు క్యాన్సర్‌ కారకాలగా అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. 2-4 డి, అసిఫేట్, మెటొలాక్లోర్, మీథోమైల్‌ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు.

Pesticides: పురుగుల మందులతో క్యాన్సర్‌ ముప్పు.. పరిశోధనలో వెల్లడైన సంచలన నిజాలు
New Update

ఓ రైతు పొలంలో పురుగుల మందు పిచికారీ చేసి ఇంటికి వచ్చాడు.. స్నానం చేయకుండా, బట్టలు కూడా మార్చుకోకుండా నిద్రపోయాడు. ఉదయం లేచే సరికి శవమై కనిపించాడు. ఇలాంటి కథ మనం అనేకసార్లు విని ఉంటాం. పురుగులమందులు ఎంత ప్రమోదకరమైనవో చెప్పేందుకు ఇది ఓ ఎగ్జాంపుల్‌ మాత్రమే. పొలంలో పురుగులను చంపేందుకు, పంటలను కాపాడేందుకు పెస్టిసైడ్స్‌ వాడుతుంటారు రైతులు. అయితే ఇవి కేవలం పురుగును మాత్రమే కాదు రైతుల ప్రాణాన్ని కూడా తోడేస్తున్నాయి. అమెరికా సైంటిస్టుల పరిశోధనలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి.

Also Read: పారిస్ ఒలంపిక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిన భారత్..

కొన్ని రకాల పురుగుమందుల వినియోగం రైతుల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుంది. ఈ పురుగుమందుల వల్ల రైతుల్లో క్యాన్సర్‌ ప్రమాదం గణనీయంగా పెరుగుతోంది. సిగరెట్‌ స్మోకింగ్‌ వల్ల క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు ఏ స్థాయిలో ఉంటాయో.. ఈ రసాయనాల వాడకంతోనూ అంతే ముప్పు పొంచి ఉంటుంది. ఈ విషయాలను అమెరికా పరిశోధకులు గుర్తించారు. మొత్తం 69 రకాల పురుగుమందులను పరిశీలించిన ఓ బృందం రైతులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కీటకాలు, కలుపుమొక్కల బెడదను తగ్గించేందుకు భారత్‌లో వినియోగించే పలు రకాల పురుగుల మందులు క్యాన్సర్‌ కారకాలగా పరిశోధకులు చెబుతున్నారు. ఇండియాలో వినియోగించే 2-4 డి, అసిఫేట్, మెటొలాక్లోర్, మీథోమైల్‌ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. సాధారణంగా పురుగుమందులను వినియోగించేటప్పుడు రైతులు వాటి ప్రభావానికి లోనవుతుంటారు. ఆ స్థాయి ఎంత ఉంటుందో తేల్చేందుకు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. 2015-2019 మధ్య అమెరికాలో క్యాన్సర్‌ బారిన పడ్డవారి వివరాలను సేకరించి పరిశీలించారు.

Also read: నీట్-యూజీ రివైజ్డ్ ఫలితాలు విడుదల.. ఇదిగో డైరెక్ట్‌ లింక్

పురుగుమందుల పిచికారీ ప్రభావంతో ప్రధానంగా మూడు రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు రైతులు. లింఫోమా, లుకేమియా, బ్లాడర్‌ క్యాన్సర్‌ లాంటి క్యాన్సర్ల ముప్పు పెరుగుతోంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరొకటి ఉంది. చాలా సందర్భాల్లో వివిధ రకాల పురుగుమందులను కలిపి వాడుతారు రైతులు. దీంతో వాటిలోని ఏ రసాయనం వల్ల క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందో తెలియదు. దీనిపై లోతుగా పరిశోధించాల్సి ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో పండించే పంటలను బట్టి.. వచ్చే క్యాన్సర్లు కూడా మారుతున్నాయి. ఎందుకంటే ప్రాంతీయత కూడా ఇక్కడ ముఖ్యం.

#farmers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe