AUS VS PAK: లిఫ్ట్‌లో ఇరుక్కున్న అంపైర్‌.. ఆగిపోయిన మ్యాచ్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు లంచ్ తర్వాత వింత ఘటన జరిగింది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
AUS VS PAK: లిఫ్ట్‌లో ఇరుక్కున్న అంపైర్‌.. ఆగిపోయిన మ్యాచ్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

వర్షం పడి మ్యాచ్‌ ఆగిపోవడం చూశాం.. లైట్‌ ఫెయిల్యూర్‌తో మ్యాచ్‌ ఆగిపోవడం కూడా చూశాం.. ఫ్లడ్‌లైట్స్‌ పనిచేయక మ్యాచ్‌ నిలిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.. పిచ్‌ డేంజరస్‌గా ఉందంటూ మ్యాచ్‌ను రద్దు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఘటనలో జరిగిన ఓ ఘటన క్రికెట్‌ ఫ్యాన్స్‌ను కాసేపు టెన్షన్ పట్టినా.. తర్వాత నువ్వుకునేలా చేసింది. మెల్‌బోర్న్‌(Melbourne)లో ఆస్ట్రేలియా(Australia), పాకిస్థాన్(Pakistan) మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. మూడో రోజు మైదానంలో ఫుల్ డ్రామా జరిగింది. మూడో రోజు లంచ్ తర్వాత థర్డ్ అంపైర్ సీటులో లేకపోవడంతో మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేయాల్సి వచ్చింది. ఇలా ఎందుకు జరిగింది? అంపైర్ సీటు నుంచి ఎందుకు మిస్సయ్యాడు? మ్యాచ్‌కు ఎందుకు అంతరాయం ఏర్పడింది.?


అసలేం జరిగిందంటే?
ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు లంచ్ తర్వాత థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. దీంతో దాదాపు 7 నిమిషాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది. బ్రాడ్‌కాస్టర్ కెమెరాను థర్డ్ అంపైర్ సీటు వైపు తిప్పినప్పుడు, ఇల్లింగ్‌వర్త్ తన కుర్చీలో లేడు. లంచ్ ముగించుకుని తన సీటు వైపు వస్తుండగా ఇల్లింగ్‌వర్త్(Richard Illingworth) లిఫ్ట్‌(Lift)లో ఇరుక్కుపోయాడని లైవ్ మ్యాచ్ సందర్భంగా కామెంటెటర్స్‌ చెప్పారు. ఈ మేరకు ఫీల్డ్ అంపైర్లు ఆస్ట్రేలియా బ్యాటర్లు డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషేన్‌కు సమాచారం అందించారు. అయితే మళ్లీ కాసేపటి తర్వాత ఇల్లింగ్‌వర్త్ తన సీటుకు చేరుకున్నాడు. అక్కడ నుంచి ఆట ప్రారంభించమని తన పొజిషన్‌ నుంచి ఆన్-ఫీల్డ్ అంపైర్లకు సంకేతాలు ఇచ్చాడు. తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

కాపాడిన స్మిత్, మిచెల్ మార్ష్:
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్‌ 63 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 42 పరుగులు, మిచెల్ మార్ష్ 41 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 38 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లు తీశాడు. షాహీన్ అఫ్రిది, మీర్ హమ్జా, హసన్ అలీ చెరో రెండు వికెట్లు తీశాడు. ఇక ఒకానొక సమయంలో పటిష్టంగా ఆరంభించిన పాక్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులకే కుప్పకూలింది. ఒక పాయింట్ ఆఫ్‌ టైమ్‌లో పాకిస్థాన్ స్కోరు ఒక వికెట్‌కు 124 పరుగులు.. అయితే ఆ తర్వాత ఆ జట్టు 140 పరుగులకే ఆ తర్వాత తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఇక మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మిచెల్ మార్ష్‌, స్టివెన్‌ స్మీత్‌ కాపాడారు.

Also Read: కెప్టెన్ విజయ్ కాంత్ ఫేవరేట్ మన రెబల్ స్టార్ ప్రభాస్

WATCH:

Advertisment
తాజా కథనాలు