Software Employee Died After Falling Into Water Sump: హైదరాబాద్ రాయదుర్గంలో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం కోసం ఉన్న ఊరు వదిలి పట్టణానికి వచ్చిన ఓ యువకుడు అనుకోని సంఘటనతో ప్రాణాలు కోల్పోయాడు. అంజయ్యనగర్‌లోని ఓ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గేటు ముందున్న సంపు మూత తెరవడంతో..
ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్య నగర్‌లో షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్(Shaik Akmal Sufuyan- 24). అయితే రోజువారి కార్యక్రమాల్లో భాగంగానే బజారుకెళ్లిన అక్మల్ అరటిపండ్లు తీసుకుని భవనం లోపలికి వచ్చాడు. అయితే గేటు ముందున్న సంపు మూత తెరిచివుంచడం గమనించకుండానే ముందుకు నడిచాడు. దీంతో ఒక్కసారిగా సంపులో పడిపోయాడు.
ఇది కూడా చదవండి: Hyderabad: మాధవీలతకు ఆలింగనం.. ఏఎస్సై కి షాక్ ఇచ్చిన సీపీ!
ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో..
ఈ క్రమంలో అక్కడున్న వ్యక్తికి శబ్ధం రావడంతో ఏం జరిగిందో అర్థం కాకపోవడంతో అటు ఇటు గమనించగా ఎక్కడ ఎవరూ కనిపించలేదు. అరటిపండ్లు సంపు పక్కన ఉండటం గమనించి నీళ్ల సంపు లోపలికి చూడగా అప్పటికే అక్మల్ మరణించినట్లు తెలిపాడు. ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి సీసీ పుటేజీలో క్లియర్ గా రికార్డ్ అయింది. హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.