/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Singapore-Airlines.jpg)
Singapore Airlines: విమానంలో తీవ్ర కుదుపుల కారణంగా ఓ ప్రయాణికుడి ప్రాణాన్ని పోయింది. లండన్ నుండి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777-300ER విమానం ఎయిర్ పాకెట్‌ను ఢీకొట్టింది. అప్రమత్తమైన పైలెట్లు మంగళవారం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయాలు అయినట్లు సమాచారం. ఈ విమానంలో 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ పేర్కొంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
A Singapore Airlines Boeing 777-312(ER) aircraft (9V-SWM) operating flight SQ321 from London (LHR) to Singapore (SIN) hit an air pocket and made an emergency landing at Suvarnabhumi Airport, Bangkok (BKK) at 3:34 pm today. Initial reports indicate 20 people were injured. pic.twitter.com/gMoVLXXyCu
— Rudra 🔱 (@invincible39) May 21, 2024