జీవితంలో మళ్లీ దాని జోలికి పోనంటున్న సలార్ భామ!

జీవితంలో మద్యం కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని తెలుసుకున్నాను అంటోంది శ్రుతి హాసన్‌. ఇక జీవితంలో మద్యం జోలికి వెళ్లనని ఇటీవల ఈ భామ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్‌ గా మారాయి.

జీవితంలో మళ్లీ దాని జోలికి పోనంటున్న సలార్ భామ!
New Update

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ (Sruthi haasan)  గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హసన్‌ కూతురిగా ఇండస్ట్రీలోకి పరిచయం అయినప్పటికీ..తన నటన, అందంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే అగ్ర హీరోలందరితో శ్రుతి యాక్ట్‌ చేసింది.
తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.

ఆ తరువాత మళ్లీ ఇండస్ట్రీలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. అప్పటి నుంచి శ్రుతి వెనుతిరిగి చూడలేదు.ఈ ఏడాది శ్రుతి అకౌంట్లో రెండు హిట్లు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన అటు చిరంజీవి(Chiranjeevi), ఇటు బాలకృష్ణ (Balakrishna) సినిమాలు రెండిటిలోనూ శ్రుతినే హీరోయిన్‌. ఇటీవల విడుదలైన హాయ్‌ నాన్న (Hai nanna) చిత్రంలో కూడా శ్రుతి ఓ కీలక పాత్రలో కనిపించి మెప్పిచింది.

ఇక శ్రుతి ఆశలన్నీ కూడా సలార్‌  (Salaar) సినిమా మీదే ఉన్నాయి. డిసెంబర్‌ 22 న గ్రాండ్‌ విడుదల అవుతున్న సలార్‌ కోసం అభిమానులతో పాటు శ్రుతి కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఈ చిత్రంలో శ్రుతి జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. తాజాగా శ్రుతి ఓ కార్యక్రమంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇక నుంచి తాను మద్యపానానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా డ్రగ్స్ జోలికి పోలేదని తెలిపింది. తనకు గతంలో తాగుడు అలవాటు ఉండేదని శ్రుతి ఇంతకు ముందే చెప్పింది. అయితే మందు తాగడం వల్ల ఎలాంటి ఆనందం లేదనే విషయం అర్థమైంది.అప్పటి నుంచి ఆ అలవాటుకు దూరంగా ఉంటున్నానని ఆమె చెప్పింది.

గత ఎనిమిది సంవత్సరాల నుంచి మద్యానికి దూరంగా ఉంటున్నట్లు కూడా శ్రుతి వివరించింది. '' పార్టీలకు, మందుకు దూరమైనందుకు ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు ఎలాంటి హ్యాంగోవర్స్‌ లేవు. జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది''అని శ్రుతి హాసన్ చెప్పింది.
మళ్లీ జీవితంలో ఎప్పుడు కూడా మందు ముట్టుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది.

మందు మానేసిన తరువాత పార్టీలు, ఫ్రెండ్స్‌ను దూరం పెట్టడం చాలా కష్టంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం శ్రుతి కామెంట్స్‌ వైరల్ గా మారాయి.

Also read: ఆ పని చేయాలంటే నిమిషానికి 10 లక్షలు ఇవ్వాల్సిందే!

#salaar #sruthihasan #viral-comments
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe