దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సు రోడ్డు పక్కన ఉన్న ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. ఢిల్లీలోని రోహిణిలో శనివారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా...ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు అదుపు తప్పడంపై గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బస్సు రోహిణి సెక్టర్ 3,4 మధ్య డివైడర్ రోడ్డుపై వెళ్తోంది. ఆ సమయంలో బస్సు ప్రయాణికులు వదిలేసి డిపోకు వెళ్తోంది. ఆకస్మాత్తుగా బస్సు తప్పి కారు, రిక్షా, టూవీలర్స్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ద్రుశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బస్సు డ్రైవర్ కు మూర్ఛరావడంతోనే ఇలా జరిగిందని కొందరు చెబతున్నారు. ప్రమాదం .జరిగిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ ను కిటికీలో నుంచి బయటకు తీశారు. అయితే బస్సు డ్రైవర్ అప్పటికే పూర్తి స్పృహలో లేడు.
ఇది కూడా చదవండి: మూడోసారి మనమే..బీఆర్ఎస్ విజయం ఖాయం..ఆర్టీవీ ఇంటర్వ్యూలో గాదారి కిషోర్..!!