Hero Prabhas: హీరో ప్రభాస్ కు షాక్.. సెల్ఫీ కోసం వచ్చి చెంపదెబ్బ కొట్టిన యువతి

పాన్ ఇండియా స్టార్(Pan India Star) ప్రభాస్ కు సంబందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన లేడీ ఫ్యాన్ చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. .!

Hero Prabhas: హీరో ప్రభాస్ కు షాక్.. సెల్ఫీ కోసం వచ్చి చెంపదెబ్బ కొట్టిన యువతి
New Update

Hero Prabhas: తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి చాటిన నటుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas). బాహుబలి సినిమాతో ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో కీర్తి తెచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ప్రభాస్ తో సినిమాలు(Movies) చేయడానికి దిగ్గజ డైరెక్టర్లు సైతం క్యూలో ఉన్నారు. బాహుబలి లాంటి గొప్ప సినిమా తర్వాత ప్రభాస్ తో తీసే సినిమాలు అన్ని హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీయడానికే దర్శకులు, నిర్మాతలు మక్కువ చూపుతున్నారు. 'ఆదిపురుష్' సినిమా తరువాత ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'సలార్'(Salaar) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' రిలీజ్ డేట్ డిసెంబర్ 22 అని ప్రకటించారు. ప్రస్తుతం సలార్ టీం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇటు 'సలార్' సినిమాతో పాటు, భారీ బడ్జెట్ తో దర్శకుడు నాగశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కీ'(Kalki) పనుల్లో కూడా బిజీగా ఉన్నాడు మన రెబెల్ స్టార్.

సినిమా షూటింగుల్లో ఎంత బిజీగా ఉన్నా, తన పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తారు. తన ఫ్యాన్స్ ను ఎప్పుడు కలిసిన వారి పట్ల చాలా గొప్పగా వ్యవహరిస్తారు. హీరో గా మాత్రమే కాదు ప్రభాస్ వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ప్రభాస్  ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే  కొన్ని సార్లు షాక్ అవుతుంటారు.తన నటన, మంచితనం, అభిమానుల పట్ల చూపించే ప్రేమ ఆయనను ఎంతో మందికి దగ్గర చేసింది.

ఈ మధ్య కాలంలో ప్రభాస్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన అభిమాని చేసిన పనికి అందరు ఆశ్చర్యపోయారు.

తెలుగు హీరోల్లో ప్రభాస్ కు విపరీతమైన ఫ్యాన్(Fans) ఫాలోయింగ్ ఉంటుంది.  ఆయనంటే అభిమానులకు పిచ్చి ఎంత పిచ్చంటే ప్రభాస్ ఎదో ప్రమోషన్స్ కోసం వెళ్తూ, ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. ప్రభాస్ ను చూసిన ఒక లేడీ ఫ్యాన్ తనతో సెల్ఫీ దిగి, ప్రభాస్ చెంప పై సరదాగా కొట్టేసి వెళ్ళిపోయింది. ప్రభాస్ ను చూసిన ఆనందంలో ఆ అమ్మాయి ప్రభాస్ చెంపను అలా తాకి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు కొంత మంది క్యూట్ గా ఉందంటున్నారు, మరికొంత మంది ప్రభాస్ ను చెంప దెబ్బ కొట్టింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

Also Read: Chiranjeevi Next Movie: ఆ సంచలన సినిమా సీక్వెల్ కు చిరు ప్లాన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

#rebel-star-prabhas #pan-india-star-prabhas #prabhas-salaar-movie #prabhas-fans
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి