ఇప్పుడంతా ఓటీటీ (OTT)ల కాలం నడుస్తోంది. ఎక్కడ చూసిన వాటి హవానే కనిపిస్తోంది. ప్రేక్షకులు థియేటర్స్ కంటే ఎక్కువగా ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ధర తక్కువ..ఇంటిల్లిపాది కలిసి ఎంచక్కా సినిమాలు చూసేయోచ్చు. టికెట్ కు పెట్టే డబ్బులతో రుచికరమైన స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయవచ్చు. ఇంట్లోనూ దర్జగా కూర్చుండి మీకు కావాల్సిన సినిమాను చూడవచ్చు. దీంతో ఓటీటీలు కూడా కొత్త కొత్త కంటెంట్ తో ఆడియన్స్ ను అలరించేందుకు వారికి ముందుకు వస్తున్నాయి.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ నెలసరి సబ్ స్క్రిప్షన్ (Amazon prime)ఛార్జీల విషయంలో మాత్రం ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) వీడియోస్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఇక నుంచి సినిమా మధ్యలో యాడ్స్ (ADDS) రాకుండా అదనంగా ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ కొత్త ఛార్జీల మోత తెలిసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. నిజానికి చాలా ఓటీటీల్లో సినిమా ప్రసారం మధ్య వాణిజ్య ప్రకటనలు రావు. కానీ అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు మాత్రం మధ్యలో నుంచి సినిమాలతోపాటు యాడ్స్ ను కూడా చూడాల్సి ఉంటుంది. 2024 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో వాణిజ్య ప్రకటనలు ప్రసారం అవుతాయని సంస్థ ఇదివరకే వెల్లడించింది. అయితే యాడ్స్ స్కిప్ చేయాలనుకునేవారు దానికోసం అదనంగా మరో రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ నిర్ణయం పట్ల అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు (Amazon Prime customers)ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.
ఇది కూాడా చదవండి; కేజీ చద్దన్నం రూ.1000 అంట.. వైరల్ అవుతున్న వీడియో!