అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తిందో తెలియదు. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు, సెలబ్రెటీలు అయిపోతారు. మరికొందరు ఉన్న ఆస్తులు పోగొట్టుకుంటారు. అయితే ఈమధ్య మత్స్యకారులకు కూడా గోల్డ్‌ఫిష్ లాంటి అరుదైన చేపలు వలలో పడటంతో వాటిని అమ్మి లక్షలు సంపాదించిన సందర్భాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పడిమడక మత్స్యకారులకు గోల్డెన్ ఫిష్‌గా పిలవబడే ఓ అరుదైన కచిడి చేప చిక్కింది. ఈ చేపను కొనుక్కునేందుకు స్థానిక వ్యాపారులు పోటీ పడ్డారు. పూడిమడకకు చెంద్న మేరుగు కొండయ్య అనే ఓ వ్యాపారి ఆ చేపను రూ.3.90 లక్షలకు సొంతం చేసుకున్నారు.
అయితే ఈ చేప దాదాపు 27 కేజీల బరువు ఉందని మేరుకు నూకయ్య అనే మత్స్యకారుడు చెప్పారు. ఇలాంటి అరుదైన కచిడి చేపలో ఔషధ గుణాలు ఉంటాయని మత్స్యకారులు తెలిపారు. సాధారణంగా వైద్యులు శస్త్రచికిత్స చేసిన అనంతరం కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారుచేస్తారని తెలిపారు. అంతేకాకుండా.. మందుల తయారీలో కూడా దీని భాగాలను వినియోగిస్తారని పేర్కొన్నారు.