Law Exam : టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కి ఉన్న క్రేజ్ తెలిసిందే కదా.. వరల్డ్ వైడ్ గా లక్షలాది మంది అభిమానులు విరాట్ సొంతం. రికార్డులు నెలకొల్పుతూ, వాటిని తిరగరాస్తూ జోరు మీదున్న కోహ్లీ ఇటీవలే వన్డేల్లో సెంచరీల హాఫ్ సెంచరీ కూడా చేశాడు. క్రికెట్ లో మాత్రమే కాదు.. ఇతర రంగాల్లోనూ కోహ్లీ పేరు మార్మోగుతోంది. తాజాగా న్యాయ విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో కోహ్లీపై ఓ ప్రశ్న అడగడం విశేషం.
ఇటీవల జరిగిన ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్టు (AILET)లో ఐపీఎల్ పై ఓ ప్రశ్న అడిగారు. 2008 లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒకే టీం తరపున ఆడిన ఆటగాడెవరన్నది ఆ ప్రశ్న. ఆప్షన్లుగా బెన్ స్టోక్స్, వార్నర్, హార్దిక్ పాండ్య, విరాట్ కోహ్లీ పేర్లున్నాయి. ఐపీఎల్ ఫ్యాన్స్ కు సమాధానం కోసం ఆప్షన్లు కూడా వెతకాల్సిన అవసరం లేదు కదా. దానికి జవాబు విరాట్ కోహ్లీ అని ప్రతి క్రికెట్ లవర్ కు తెలిసిందే.
ఇది కూడా చదవండి: ENG W vs IND W: గెలిచిన భారత్.. ఇంగ్లండ్ దే సిరీస్
ఐపీఎల్ లో వార్నర్ రెండు, బెన్ స్టోక్స్ మూడు, హార్దిక్ పాండ్య రెండు జట్లకు ఆడారు. కోహ్లీ మాత్రమే తొలి నుంచి రాయల్ చాలెంజర్స్ టీంలో ఆడుతున్నాడు.