Telangana : ఇనుప మేకులు మింగిన ఖైదీ.. చివరికి

హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకులనే మింగేశాడు. అతడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటడంతో 4 రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ ప్రిజనర్స్(ఖైదీలు) వార్డులోకి చేర్చారు. చివరికి వైద్యులు ఎండోస్కోపీ చేసి ఆ ఖైదీ మింగిన తొమ్మిది మేకులను బయటకు తీశారు.

Telangana : ఇనుప మేకులు మింగిన ఖైదీ.. చివరికి
New Update

Prisoner : హైదరాబాద్‌(Hyderabad) లోని చర్లపల్లి జైలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ ఖైదీ ఏకంగా ఇనుప మేకు(Iron Nails) లనే మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పి(Stomach Pain) తో బాధపడుతున్న అతడు ప్రాణాపాయ స్థితిలో 4 రోజుల క్రితమే సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌(ఖైదీలు) వార్డులో చేరాడు. చివరికి వైద్యులు ఎండోస్కోపీ చేసి ఆ ఖైదీ మింగిన తొమ్మిది మేకులను బయటకు తీసేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చర్లపల్లి జైలులో మహ్మద్ షేక్ (32) అనే వ్యక్తి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు.

Also Read: సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్..అతనికి సంబంధం లేదు

జైలు వైద్యుల సూచనతో 4 రోజుల క్రితం అతడిని గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) లోని జైలు వార్డులో చేర్పించారు. అయితే అతడి కడుపులో కొన్ని ఇనుప మేకులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. చివరకి చికిత్స చేసి వాటిని బయటకి తీశారు. అయితే తాను 16 మేకులను పలు ధపాలుగా మింగానని వైద్యులకు మహ్మద్ షేక్ చెప్పాడు. అతడి కడుపులో తొమ్మిది మేకులు మాత్రమే ఉన్నాయని.. మిగిలినవి మలద్వారం నుంచి బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

మహ్మద్ షేక్‌కు అసలు మేకులు ఎక్కడ దొరికాయి. వాటిని ఎందుకు మింగాడు అనే విషయాలపై ఇంకా స్పష్టతం రాలేదు. ప్రస్తుతం వీటిపై జైలు అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోగి ప్రాణాలు కాపాడిన.. గాంధీ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు, పీజీలు, సిబ్బంది పనితీరుపై వైద్య ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.

Also Read: ఇంకా తేలని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి

#telugu-news #prisoner #charlapally-jail #iron-nails
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe