kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ రుచి చూసారు. సోమవారం (నిన్న) సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగిన ఎమ్మెల్సీ కవిత ఎంతో ఇష్టంగా మోమొస్ తిన్నారు.

New Update
kavitha: గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ తిన్న ఎమ్మెల్సీ కవిత

స్ట్రీట్ ఫుడ్ రుచి

తెలంగాణ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతి వీధుల్లో స్ట్రీట్ ఫుడ్ రుచి చూసారు. సోమవారం (నిన్న) సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న మొబైల్ ఫుడ్ కోర్డు వద్ద ఆగిన ఎమ్మెల్సీ కవిత ఎంతో ఇష్టంగా మోమొస్ తిన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కవిత అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన్నప్పుడు స్ట్రీట్ ఫుడ్ వద్దని ఎవరంటారు. ఎలాగైన అక్కడ ఉన్న వంటకాలను రుచి చూడాలనిపిస్తుంది. ప్రత్యేకించి మోమొస్ లాంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ పోస్ట్‌కి క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘సింప్లిసిటీ’ అంటూ కవితను అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కామాఖ్య ఆలయంలో ప్రత్యేక పూజలు

అస్సాం గుహటిలోని కామాఖ్య అమ్మవారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం దర్శించుకున్న విషయం తెలిసిందే. ఆలయానికి వచ్చిన కవితకు పూజారులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కామాఖ్య ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ, దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు కవిత చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు చెప్పుకోచ్చారు.

ఆనందంగా ఉంది

అంతేకాకుండా.. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆదరిస్తారని కవిత చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారని కవిత జోస్యం చెప్పారు. అమ్మవారిని నాలుగైదు సంవత్సరాల క్రితం ఒకసారి దర్శించుకున్నానని కవిత గుర్తు చేశారు. మళ్లి కామాఖ్య అమ్మవారిని ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉందని కవిత చెప్పారు. ఆధ్యాత్మికతలో భారతదేశం విరజిల్లుతోందని కవిత అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కామాఖ్య దేవిని దర్శించుకునే భాగ్యం త‌న‌కు కలగడం ఆనందంగా ఉందని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు.

Advertisment
తాజా కథనాలు