అప్పుడప్పుడు కొన్ని వింతలు చూస్తుంటాం...అంతకంటే ఎక్కువ దారుణాలు చూస్తుంటాం. కొన్ని ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటే..మరికొన్ని ఘటనలు మనస్సును కలచివేస్తాయి. ఇంకొన్ని ఘటనల గురించి వింటుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాదు. అలాంటి ఘటనే ఆదిలాబాద్ ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ ఆర్టీసీ డీపో కండక్టర్ పై ప్రయాణికుడు దాడి చేశాడు. అంతేకాదు చెంప కొరికి గాయపరిచాడు. మహారాష్ట్రలోని పాండ్రకవడకు ఆదిలాబాద్ డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెళ్లి తిరిగివస్తోంది. మహారాష్ట్ర పరిధి బోరి బస్ స్టాప్ వద్ద ఉట్నూరు సమీపంలోని హస్నాపూర్ కు చెందిన అజీంఖాన్ ఎక్కాడు. ఆదిలాబాద్ కు టికెట్ తీసుకున్నాడు. ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో అజీంఖాన్ కు సీటు దొరకలేదు.
దీంతో కండక్టర్ తో గొడవకు దిగాడు. తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మొండికేశాడు. కండక్టర్ డబ్బులు తిరిగి ఇచ్చేసి బస్సులో నుంచి కిందికి దించేశాడు. అయితే అజీంఖాన్ మరో వాహనంలో పిప్పల్ కోటి వరకు వచ్చి బస్సును ఆపాడు. మళ్లీ బస్సులోకి ఎక్కి కండక్టర్ తో గొడవకు దిగాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. కోపంతో రగిలిపోయిన సదరు ప్రయాణికుడు కండక్టర్ ను నెట్టేసి ఆయన చెంప కొరికాడు. బస్సులో అందరితో వాగ్వాదం చేస్తూ ఆదిలాబాద్ కు చేరుకున్నాడు. ఈ విషయం గురించి బాధిత కండక్టర్ ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
13 ఏళ్ల బాలికతో పెళ్లి.. పది రోజులుగా అత్యాచారం చేసి
అమ్మాయిలపై లైంగిక దాడులకు ఆగట్లేదు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడోదగ్గర కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో బస్స్ కోసం వేచివున్న మహిళపై గ్యాంగ్ రేప్ జరగగా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో స్కూల్ విద్యార్థినిలపై టీచర్లే లైంగిక దాడి చేశారు. ఈ దారుణమైన సంఘటనలు జరిగి కనీసం వారం గడవకముందే మైనర్ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకుని పదిరోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డ దారుణమైన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో కలకలం రేపింది.
ఇది కూడా చదవండి : పోచంపల్లి అభివృద్ధిపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.. కార్మికులను చూసి
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికను ఒక వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు కుటుంబ సభ్యులు. దీంతో ఆ వ్యక్తి బాలికను బలవంతంగా పది రోజులుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి అతని అరాచకం తట్టుకోలేక తన బాధనంతా తల్లితో చెప్పుకుంది. ఈ క్రమంలోనే తల్లి బాధితురాలిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి జరిగిందంతా చెప్పింది. బలవంతపు పెళ్లి, లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం పోక్సో సెక్షన్‌తోపాటు, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని అజ్మీర్ ఏఎస్పీ మహమూద్ ఖాన్ తెలిపారు.
ఇది కూడాచదవండి: ప్రతిరోజూ బీర్ తాగుతున్నారా? మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తే షాక్ అవుతారు..!!