Nutrition Diet : ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలని మనందరికీ తెలుసు. కానీ దైనందిన జీతానికి రోజూ పోషకాహారాన్ని తీసుకోవడం కష్టంగా మారుతోంది. సమతుల ఆహారం తీసుకోవడంలో చాలామంది విఫలమవుతున్నారు. దీంతో అనారోగ్యాలబారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో సమయపాలనలేని తిండి, ఫాస్ట్ ఫుడ్ (Fast Food) కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. అలాంటి వారికోసం వైద్య నిపుణులు 7 చిట్కాలను సూచిస్తున్నారు.
ప్రతిరోజు వ్యాయామం
ప్రతిరోజు ఉదయం వ్యాయామం (Exercise) చేయడం వల్ల మీ జీవక్రియ చురుగ్గా పనిచేస్తుంది. రోజంతా మీరు ఉత్సాహంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. జిమ్‌లో కఠోర కసరత్తులు లేదా తీవ్రంగా కష్టపడాల్సిన అవసరం లేదు. శరీరానికి కాస్త శ్రమ కల్పిస్తే చాలు. మీ జీర్ణ క్రియ చురుగ్గా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.
వీలైనంత ఎక్కువగా కూరగాయలు..
జీర్ణ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న వారు కూరగాయలు ఎక్కువగా తినడం ఉత్తమం. కూరగాయలు ఎక్కువగా తినాలనుకుంటే సాదా ఆమ్లెట్ కాకుండా అందులో పాలకూర, మష్రూమ్స్, తాజా టమోటాలు, ఎర్ర మిరియాలు జోడించాలి. వెజిటబుల్ స్మూతీలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలు, ఆకు కూరలు మీ మెనూలో ఉండేలా చూసుకోండి.
సమయపాలన..
సమయానికి తినడం చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఆకలి బాధించకముందే తినేయాలి. లేదంటే ఆరోగ్యకరమైన ఆహారం (Healthy Food) కోసం చూడకుండా ఆకలిలో అందుబాటులో ఉన్నది తినేస్తుంటాం. బయటకు వెళ్లేటప్పుడు బ్యాగులో తినడానికి ఏదైనా తీసుకెళ్లడం వంటివి మీ అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. మార్కెట్‌లో దొరికే ఆహారం కంటే మనం తయారు చేసుకున్న ఫుడ్ తినడం బెటర్.
ఎక్కువ ప్రోటీన్స్ తీసుకోవాలి..
జంక్ ఫుడ్ తగ్గించుకుని వీలైనంతవరకూ దానికి దూరంగా ఉండండి. స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలని శరీరం కోరుకుంటుంది. కానీ, కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు శరీరానికి ప్రోటీన్ అవసరం ఎక్కువ. వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రోటీన్ తినండం ఆరోగ్యానికి చాలా మంచిది.
సూపర్‌మార్కెట్ ఫుడ్ ప్రమాదం..
సూపర్‌మార్కెట్లు, పెద్ద పెద్ద స్టోర్లలో బిల్లు కౌంటర్ దగ్గరకు వెళ్లడానికి ముందు మనం అనేక ర కాల ఆహార పదార్థాలతో కూడిన అల్మారాలు, షెల్ఫ్‌లను దాటాల్సి ఉంటుంది. ఈ ఆహారపదార్థాలన్నీ ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడవు. కానీ, సూపర్‌మార్కెట్లలో వాటన్నింటినీ దాటుకుని మనం వెళ్లేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్యకర ఆహార పదార్థాలను మీ షాపింగ్ బుట్టలో వేయకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు.
నిరుత్సాహనికి లోనుకాకుడదు..
ఒకవేళ మీరు తినడానికి జంక్‌ఫుడ్‌ను ఎంచుకున్నట్లయితే దాన్ని ఆస్వాదించండి. ‘గిల్టీ ఫీలింగ్’ తెచ్చుకోకండి. కానీ, మరోసారి ఆ ఆహారాన్ని తీనకుండా జాగ్రత్త పడండి.
తగినన్నీ నీరు తాగండి..
నీరు మన శరీరానికి చాలా ఉత్తమమైనది. జ్యూస్, ఆల్కహాల్, కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిలో మీరు ఊహించినదానికంటే అధికంగా చక్కెర ఉండొచ్చు.
ఆరోగ్యకరమైన మానవ శరీరంలో మూడింట రెండొంతులు నీరే ఉంటుంది. శరరీమంతా పోషకాలు సరఫరా కావడానికి, వ్యర్థాలు రవాణా చేయడానికి ద్రవాలు అవసరం. కాబట్టి రోజుకు స్వచ్ఛమైన నీరు కనీసం రెండు లీటర్లు తాగండి.
Also Read : శ్రావణంలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి!