KURNOOL: కసాయి తల్లి.. పసిపిల్లలను నీటి బకెట్‌లో ముంచి దారుణం

ముక్కుపచ్చలారని ఇద్దరు కొడుకులను తల్లి బకెట్ నీళ్లలో ముంచి చంపిన ఘటన కర్నూల్ జిల్లాలో స్థానికులను కలిచివేసింది. హాల్వి గ్రామానికి చెందిన శారద.. భర్త రామకృష్ణ లేని సమయంలో వెంకటేశ్‌ (3), భరత్‌ (6 నెలలు)లను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతుంది.

New Update
KURNOOL: కసాయి తల్లి.. పసిపిల్లలను నీటి బకెట్‌లో ముంచి దారుణం

KURNOOL: నవమాసాలు మోసి, కని పెంచిన ఓ తల్లి తన పిల్లలను బలితీసుకున్న భయంకరమైన సంఘటన కర్నూల్ లో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇద్దరు కొడుకులను అత్యంత దారుణంగా చంపేసింది. ఐదేళ్లు కూడా నిండని అభం శుభం తెలియని బాలలను ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా తాను ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఈ విషాధ ఘటన స్థానికులను కలిచివేస్తోంది.

ఈ మేరకు కర్నూలు జిల్లా కౌతాళం (Kautalam)మండలంలోని హాల్వి (Halvi) గ్రామానికి చెందిన రామకృష్ణ (Ramakrishna), శారద (Sharadha) దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే శనివారం మధ్యాహ్నం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో వెంకటేశ్‌ (3), భరత్‌ (6 నెలలు)తో కలిసివున్న శారద.. తన ఇద్దరు కుమారులు నీటి బకెట్‌లో ముంచింది. దీంతో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు తల్లడిల్లిపోయారు. కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే భర్తకు సమాచారం అందించి స్థానికుల సాయంతో దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే ఆ పసిపిల్లలు ఇద్దరూ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చిన్నారుల మృతదేహాల్ని శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Minister Komatireddy: సంచలనానికి తెరలేపిన మంత్రి కోమటిరెడ్డి ట్వీట్..కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దామంటూ..!!

అయితే తన కుమారులను తానే చంపినట్టు తెలిస్తే ఇంట్లోవారంతా తనను చంపేస్తారనే భయంతో శారద కూడా విషం తాగిందని, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు, బంధువులు తెలిపారు. ఇక శారద తన పిల్లలను చంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై నరేంద్రకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు