Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు!

తైవాన్‌ తూర్పు నగరమైన హువాలియన్‌లో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతతో 9.7 కిలో మీటర్ల లోతులో భూకంపం సంభవించగా రాజధాని తైపీలో భవనాలు కంపించినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు!
New Update

Earthquake: తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. భూకంపం 9.7 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా భవనాలు ఊగడంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీయగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

#earthquake #taiwan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe